Vishwak Sen: “మాస్ కా దాస్” గోదారోడు అనిపించుకుంటాడా?

Vishwak Sen Gangs of Godavari Movie

టాలీవుడ్ లో విభిన్న సినిమాలు చేస్తూ మాస్ జోనర్ లో హిట్లు కొడుతూ మాస్ కా దాస్ అనిపించుకుంటున్న హీరో విశ్వక్ సేన్. ఈ ఏడాది “దాస్ కా ధమ్కీ” తో సూపర్ హిట్ కొట్టి ఫుల్ జోష్ లో ఉన్నాడు ఈ హైదరాబాద్ చిన్నోడు. ఇక ప్రస్తుతం నాలుగు సినిమాల్లో నటిస్తూ చిన్న హీరోల్లో ఫుల్ బిజీ గా ఉన్నాడు. అయితే వాటిలో ముందుగా రాబోతున్న సినిమా “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి“.

ఈ సినిమాను కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తుండగా, సితార ఎంటరైన్మెంట్స్ పై నాగవంశీ నిర్మిస్తున్నాడు. ఇక తాజాగా రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది. ఈ సినిమాలో చేపలు పట్టుకు బతికే జాలరిగా విశ్వక్ సేన్ కనిపించనున్నాడు. ఈ సినిమా కథ గోదావరి ప్రాంత రాజకీయాల నేపథ్యంలో నడుస్తుందని టీజర్ ద్వారా తెలుస్తుంది. ఇక హీరోయిన్ గా నేహా శెట్టి నటిస్తుండగా, అంజలి మరో కీలక పాత్రలో నటిస్తుంది.

అయితే టీజర్ చూసాక ఒక విశ్వక్ సేన్ ఆ గెటప్ లో పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడనిపిస్తుంది. లుక్స్ పరంగా రగ్గడ్ మాస్ గెటప్ లో ఎప్పట్లాగే ఆకట్టుకున్నాడు. అయితే తాను మాట్లాడిన గోదావరి యాస అంత పర్ఫెక్ట్ గా లేదనే టాక్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. తెలంగాణ యాసలో ఊరమాస్ గా పవర్ ఫుల్ డైలాగ్స్ చెప్పే విశ్వక్ గోదారి పల్లెటూరి యాసలో డైలాగ్స్ చెప్పగలడా లేడా? అని విమర్శకులు అంటున్నారు. అయితే టీజర్ లో వచ్చిన రెండు మూడు డైలాగ్స్ ద్వారా డిసైడ్ చేయలేము, అని మరికొంత మంది విశ్లేషకుల వాదన. సినిమా మొత్తం చూసాకే కదా నటీనటుల ప్రతిభ గురించి మాట్లాడాలి అని నెటిజన్లు అంటున్నారు.

- Advertisement -

ఏది ఏమైనా ఈ సినిమా ద్వారా విశ్వక్ సేన్ మంచి హిట్ కొడితే టాలీవుడ్ లో తన క్రేజ్ ని మరింత పెంచుకోవడం ఖాయం అనిపిస్తుంది. మరి మాస్ కా దాస్ విశ్వక్ సేన్ “గ్యాంగ్స్ అఫ్ గోదావరి” తో పల్లెటూరి గోదారోడు అనిపించుకుంటాడో లేదో చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Web Stories and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు