DJ tillu : సిద్దు జొన్నలగడ్డ మరో విజయ్ దేవరకొండ అవబోతున్నాడా ?

కెరీర్ బిగినింగ్ లో చిన్న, చిన్న క్యారెక్టర్ లు చేస్తూ ఆర్టిస్ట్ గా నిలబడటానికి నానా కష్టాలు పడ్డ సిద్దు జొన్నలగడ్డ, గతేడాది రిలీజైన డీజే టిల్లు సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నాడు. క్రైమ్ కామెడీ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమా గడిచిన ఏడాది బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయాన్ని సాధించింది. ఈ సినిమాతో సిద్దు జొన్నలగడ్డ ఓవర్ నైట్ లో స్టార్ హీరోల లిస్ట్ లో చేరిపోయాడు.

సిద్దు జొన్నలగడ్డ కెరీర్ గ్రాఫ్ చూస్తుంటే విజయ్ దేవరకొండ కెరీర్ ని తలపిస్తోంది అని చెప్పొచ్చు. ఎర్లీ డేస్ లో క్యారెక్టర్ల కోసం కాళ్ళు అరిగేలా తిరిగిన వీళ్లిద్దరు ఇప్పుడు టాలీవుడ్ లో యంగ్ సెన్సేషన్ గా మారారు. అర్జున్ రెడ్డి సినిమాతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న విజయ్ ఎలాగైతే టాలీవుడ్ లో టాక్ అఫ్ ది టౌన్ అయ్యాడో సిద్దు కూడా ఇంచు మించు డీజే టిల్లు తో అలాంటి సక్సెసే అందుకున్నాడు.

ప్రస్తుతం సిద్దు జొన్నలగడ్డ డీజే టిల్లు సినిమాకి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటు మెగా స్టార్ చిరంజీవి హీరోగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో సిద్దు జొన్నలగడ్డ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడని సమాచారం. అలాగే ప్రముఖ సెలెబ్రెటీ స్టైలిస్ట్ అయిన నీరజ కోన దర్శకత్వంలో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూసింగ్ చేస్తున్న మరో సినిమాకి కూడా సిద్దు జొన్నలగడ్డ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్. విజయ్ దేవరకొండ కూడా అర్జున్ రెడ్డి సక్సెస్ తరువాత ఇలాగే వరుస సినిమాలతో దూసుకుపోగా, సిద్దు కూడా అదే విధంగా వరుస సినిమాలు చేస్తున్నాడు. దీన్ని బట్టి చూస్తే సిద్దు జొన్నలగడ్డ కూడా టాలీవుడ్ కి మరో విజయ్ దేవరకొండ అవబోతున్నడనిపిస్తోంది

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు