Naga Shourya: అదే మూస ధోరణి… ఈ సారి కూడా అదే ఫలితమా?

నాగ శౌర్య హీరోగా వస్తోన్న లేటెస్ట్ సినిమా రంగబలి ట్రైలర్ కాసేపటి క్రితం విడుదలైంది. పవన్ భాసంశెట్టి అనే డెబ్యూ డైరెక్టర్ దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాని ఎస్ఎల్వి బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు గత కొద్దీ రోజులుగా సరైన హిట్ లేక ఢీలా పడిపోయిన నాగ శౌర్య రంగబలి సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు.

ఇక ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే, డైరెక్టర్ ఎప్పుడో ఆయన చిన్నప్పుడు రాసుకున్న పిట్టకథకి రూప మిచ్చినట్టు తెలుస్తుంది. ట్రైలర్ ఓపెనింగ్ దగ్గర నుంచి ఎండింగ్ ఆకట్టుకునే ఒక్క డైలాగ్ కానీ, ఆశ్చర్యపరిచే ఒక షాట్ గాని లేదు. ఇవన్నీ లేకపోయిన సరే, కథ అయిన ఆసక్తి కరంగా ఉందా అంటే అది కూడా లేదు. పాడైపోయిన పాత ఊరగాయ పచ్చడిని ఇప్పుడు వండిన అన్నం వేసుకొని తిన్నట్టుంది.

ఇక హీరో నాగ శౌర్య విషయానికొస్తే 2018 లో వచ్చిన ఛలో సినిమా తప్ప ఇప్పటి వరకు ఆయన నుంచి వచ్చిన ఒక్క సినిమా కూడా హిట్ అవ్వలేదు. ఒకే రకమైన కథలు, ఒకే రకమైన యాక్టింగ్ చేస్తూ, ప్రేక్షకులను థియేటర్ లో కూర్చోబెట్టి వాళ్ళ పై రివెంజ్ తీసుకుంటున్నాడు. అతనితో పాటు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన యంగ్ హీరోలంతా కొత్త కథలతో సినిమాలు తీసి హిట్లు కొడుతుంటే ఈయన మాత్రం కెరీర్ ని గాలికి వదిలేసినట్టు అనిపిస్తోంది.

- Advertisement -

యుక్తి తరేజా అనే కొత్త అమ్మాయి హీరోయిన్ గా పరిచయమవుతున్న ఈ సినిమాలో కమెడియన్ సత్య, బ్రహ్మాజీలు ప్రధాన పాత్రలలో కనిపించబోతున్నారు. ఇటీవలనే విడుదలై సూపర్ హిట్టైన దసరా సినిమాలో విలన్ గా మెప్పించిన మలయాళం యాక్టర్ షైన్ టామ్ చాకో ఈ సినిమాలో కుడా విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు