Khushi: పెళ్లి పీటలెక్కనున్న విజయ్ దేవరకొండ, రష్మిక – ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయిందట..

టాలీవుడ్ లో గత కొద్దిరోజులుగా పెళ్లిళ్ల ట్రెండ్ మొదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న శర్వానంద్ పెళ్లి , వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల ఎంగేజ్మెంట్ అయిపోగా, ఈ లిస్ట్ లోకి విజయ్ దేవరకొండ-రష్మిక కపుల్ కూడా చేరనున్నట్టు తెల్సుతుంది.

రష్మిక- విజయ్ దేవరకొండల ప్రేమ వ్యవహారం గురించి ఈ రోజు కొత్తగా చెప్పాల్సిన పని లేదు. గీత గోవిందం సినిమాతో మొదలైన వీరిద్దరి పరిచయం ప్రేమ వరకు వెళ్ళిన విషయం అందరికి తెలిసిందే. ఇక పెళ్లి చేసుకోవడమే తరువాయి అని అందరు అనుకుంటుండగా తొందట్లోనే ఆ వేడుకకి కూడా ముహూర్తం కుదిరినట్టే అని స్పష్టమవుతోంది

ప్రస్తుతం విజయ్ దేవరకొండ- రష్మిక ఎవరి సినిమా పనుల్లో వారు బిజీగా ఉంటూనే , సమయం దొరికినప్పుడల్లా కలుస్తుండటం చేస్తున్నారు. అయితే ఇటీవలనే ఈ ప్రేమ పావురాలు హైదరాబాద్ లోని ఒక రెస్టారెంట్ లో భోజనం చేస్తూ కనిపించగా ఆ పిక్స్ ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. అయితే ఇందులో ఏముంది గతంలో కూడా వీరిద్దరూ పలుసార్లు బయట కనిపించరు కదా అని సరిపెట్టుకుందామంటే ఇక్కడే అసలు ట్విస్ట్ ఇచ్చారు ఈ యంగ్ లవ్ కపుల్.

- Advertisement -

గతంలో వీరిద్దరూ కలిసి మాత్రమే కెమెరాకి చిక్కారు కానీ ఇప్పుడు మాత్రం విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో సహా రష్మిక కలిసి సరదాగా మాట్లాడుతూ, భోజనం చేయడంతో అందరికి అనుమానాలు స్టార్ట్ అయ్యాయి. ఇప్పటికే వీరిద్దరికి ఎంగేజ్మెంట్ అయిపోయిందని గుస గుసలు వినిపిస్తున్నాయి. అంతే కాదు తొందర్లోనే వీళ్లిద్దరి పెళ్లి గురించి కూడా శుభవార్త రాబోతుందని ఫిలిం నగర్ టాక్.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు