Shyam : అభిమాని ఆత్మహత్యకు అండగా నిలబడ్డ ఎన్టీఆర్- వైరల్ అవుతున్న జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యలు

నిండా పాతికేళ్ళు కూడా లేని శ్యామ్ అనే యువకుడి ఆత్మ హత్య వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అయితే ఈ శ్యామ్ జూనియర్ ఎన్టీఆర్ కి వీరాభిమాని అవడం, అలాగే అనుమదాస్పదంగా ఆత్మహత్య జరగడంతో ఈ విషయం వైరల్ గా మారింది.

తూర్పుగోదావరి జిల్లా చింతలూరు గ్రామానికి చెందిన శ్యామ్, జూనియర్ ఎన్టీఆర్ కి వీరాభిమాని, ఆ మధ్య ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ ప్రమోషన్స్ అన్ని ముగించుకొని విశ్వక్ సేన్ హీరోగా నటించిన దాస్ కా ధమ్కీ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ గా ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.

దాంతో ఎన్టీఆర్ అభిమానులు ఈ ఈవెంట్ కు భారీ సంఖ్యలో వచ్చారు. అందులో శ్యామ్ కూడా ఉన్నాడు. ఇక ఎన్టీఆర్ సినిమా గురించి మాట్లాడి వెళ్తుండగా శ్యామ్ ఎన్టీఆర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి ఆయనతొ ఫోటో దిగగా.. ఆ వీడియో సోషల్ మీడియాలో అప్పట్లో వైరల్ అయింది.

- Advertisement -

వ్యక్తి గతంగా పెద్దగా సమస్యలేవి లేని శ్యామ్ సూసైడ్ చేసుకోవడం పట్ల అందరికి అనుమానాలు రేకెత్తుతున్నాయి. శ్యాం బాడీ మీద దెబ్బలు ఉండటం, అసలు డ్రగ్స్ వాడటం అలవాటే లేని శ్యాం దగ్గర డ్రగ్స్ దొరకడం, ఇవన్నీ అనుమానాలను, ఎన్టీఆర్ దృష్టికి తీసుకెళ్లనే ఉద్దేశ్యంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేయగా, ఈ విషయం ఎన్టీఆర్ దాకా వెళ్లి, ఆయన స్పందించారు.

‘శ్యామ్ మరణం అత్యంత బాధాకరమైన సంఘటన. శ్యామ్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఎటువంటి పరిస్థితుల్లో ఎలా చనిపోయి ఉంటాడో తెలియకపోవడం నా మనసును కలచి వేస్తుంది. ప్రభుత్వ అధికారులు ఈ విషయంపై తక్షణమే దర్యాప్తు జరపాలని విజ్ఞప్తి చేస్తున్నాను’ అని స్పందించటంతో శ్యాం డెత్ మిస్టరీ ఇప్పుడు ట్విట్టర్ లో ట్రెండ్ అవుతుంది.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు