Megastar Chiranjeevi: ఇండస్ట్రీ పెద్దకి సపోర్ట్ చేసే ధైర్యం ఎవరికీ లేదా?

No one has the guts to support Megastar?

టాలీవుడ్ లో గత కొన్ని రోజులుగా రాజకీయ సెగ వేడెక్కుతుందని తెలిసిందే. ముఖ్యంగా ఏపీ ప్రభుత్వానికి ఫిల్మ్ ఇండస్ట్రీకి అస్సలు పడట్లేదు. ఆ మధ్య రజినీకాంత్ ఎన్టీఆర్100 ఇయర్స్ వేడుకకి వచ్చినప్పుడు చంద్రబాబు గురించి వ్యక్తిగతంగా కొంచెం పాజిటివ్ గా చెప్పినందుకు ఆయనకీ విరుద్ధంగా ప్రభుత్వ కార్యకర్తలు ఎంత ట్రోల్ చేసారో తెలిసిందే. ఇక రీసెంట్ గా “బ్రో” సినిమాలో ఆ పార్టీ నేత అంబటి రాంబాబు ని ట్రోల్ చేసారని, సినిమాపై ఎన్నో కేసులు పెట్టడమే గాకుండా, కొన్ని చోట్ల ఆడకుండా చేసారు.

ఇక ఆ ఎమ్మెల్యే కూడా ప్రెస్ మీట్లు పెట్టి మరీ సినిమాకి వ్యతిరేకంగా మాట్లాడాడు. అయితే బ్రో గురించో, లేక మరేదైనా కారణమో తెలియదు గాని సినిమా ఇండస్ట్రీ గురించి కాదు, ముందు ప్రత్యేక హోదా గురించి కానీ , రోడ్ల నిర్మాణం గురించి కానీ ప్రాజెక్టులు గురించి కానీ, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం గురించి కానీ, ఏపీ పొలిటికల్ లీడర్స్ కలుగజేసుకోవాలి అని రాజకీయనాయకులకి చెప్పాడు.

ఇందులో ఏదో తప్పు జరిగినట్టు, ఎవర్నో తిడుతున్నట్టు భావించిన ఆ పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు ఒక్కసారిగా చిరంజీవిపై విమర్శకా బాణాలు ప్రయోగిస్తున్నారు. దీనికితోడు కొందరు పేటిఎం వ్యక్తులు సోషల్ మీడియాలో మెగా బ్రదర్స్ ని టార్గెట్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. అయితే చాలా యేళ్లుగా చిరంజీవి ఇంకా కొంతమంది బడా హీరోలు మినహా వేరే ఎవ్వరూ సినిమా ఇండస్ట్రీ కి సమస్యలు వచ్చినప్పుడు పట్టించుకోవట్లేదు. సినిమా ఇండస్ట్రీకి కరోనా సమయంలో గాని, రీసెంట్ గా ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన జర్నలిస్ట్ లకి వైద్య సదుపాయం అందించడం గాని ఎన్నో చేసారు.

- Advertisement -

అలాంటిది సినిమా ఇండస్ట్రీ వైపు నిలబడి ఒక మాట మాట్లాడినందుకు ఆ పార్టీ నేతలు అంతలా ఎగిరిపడుతుంటే, చిరు కి సపోర్ట్ చేయడానికి ఇండస్ట్రీలో ఒక్క స్టార్ కి ధైర్యం రావడం లేదా అని ట్రేడ్ పండితులు అంటున్నారు. గతంలో మా ప్రెసిడెంట్ లమని చెప్పుకునే వ్యక్తులు, ఇండస్ట్రీ బడా నిర్మాతలు, 24 క్రాఫ్ట్ పెద్దలు, కొందరు స్టార్స్ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు వీళ్ళందరూ ఏమైపోయారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. జరిగిన ఈ సంఘటన పరిణామాలని చూస్తుంటే ప్రేక్షకులకి అర్ధమైపోతుంది, ఇండస్ట్రీ కి ఎవరు ఎలాంటి సేవలు చేస్తున్నారో.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries.

Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు