Ritika nayak: ఫోటోషూట్లతో “ఇన్స్టా”లో రెచ్చిపోతున్న విశ్వక్ సేన్ హీరోయిన్?

Ritika Nayak Latest Photoshoots

ఫిల్మ్ ఇండస్ట్రీ లో హీరోయిన్ల కొరత లేని ఇండస్ట్రీ ఏదంటే టాలీవుడ్ అని అంటారు. ఇక్కడ తెలుగమ్మాయిలకి పెద్దగా అవకాశాలు ఇవ్వకపోయినా, పూరి లాంటి దర్శకులు ముంబై వెళ్లి మరీ కొత్త భామల్ని తీసుకొస్తూ ఉంటారు. అసలు వీళ్ళకెలా దొరుకుతారో తెలియదు గాని, కొంతమంది హీరోయిన్లు ఒక్క సినిమాతోనే యూత్ ని అట్రాక్ట్ చేస్తారు. అలాంటి హీరోయిన్లలో ఒకరు “రితికా నాయక్”.

ఢిల్లీ కి చెందిన ఈ సుందరి లాస్ట్ ఇయర్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన “అశోకవనంలో అర్జున కళ్యాణం” సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చి ఆకట్టుకుంది. ఇక ఆ సినిమా మంచి టాక్ తెచ్చుకుని సినిమా సూపర్ హిట్ అవడంలో హీరోయిన్ పాత్ర కూడా ఉంది. అయితే ఆ సినిమా తరువాత రితికా నాయక్ మరో సినిమా చేయలేదు. కానీ సోషల్ మిడియాలో మాత్రం ఫుల్ యాక్టీవ్ గా ఉంది. పోస్టులు మీద పోస్టులు చేస్తూ ఎప్పుడూ సందడి చేస్తుంది.

ఇక ఫోటోషూట్ల గురించి స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. మొబైల్ ఉన్న సాధారణ అమ్మాయిలే సెల్ఫీలని, స్నాప్ లని రోజు రచ్చ చేస్తారు. ఇక హీరోయిన్లు ఊరికే ఉంటారా. స్పెషల్ కెమెరాలు ఇంట్లోనే ఉన్నాయో ఏమో గాని, ఎప్పుడూ తన గ్లామర్ షూట్లతో యూత్ ని అట్ట్రాక్ట్ చేస్తూ తన ఫాలోయింగ్ ని పెంచుకుంటుంది. ఇక ఈ మధ్య బీచ్ లోనే ఎక్కువ టైం గడుపుతున్న రితికా రీసెంట్ క్లిక్స్ అన్నీ అక్కడే తీసినవి. అయితే తన నెక్స్ట్ సినిమాల అప్డేట్ లు మాత్రం చెప్పలేదు ఈ భామ.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు