Ananya Nagalla: ఈ తెలుగమ్మాయికి హీరోయిన్ గా ఛాన్సులు రావా?

Will Ananya get a chance as a heroine?

టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్ల కొరత బాగా ఉందని తెలిసిందే. చాలా మంది ప్రేక్షకులు అన్నట్టు తెలుగమ్మాయిలకు ప్రోత్సాహం తక్కువ. కానీ అందం, టాలెంట్ ఉన్న హీరోయిన్లు ప్రయత్నిస్తే ఏ రోజుకైనా అదృష్టం తలుపు తడుతుందని భావిస్తారు. అలా అవకాశాల కోసం వేచి చూస్తున్న హీరోయిన్లలో అనన్య నాగళ్ళ ఒకరు. మల్లేశం అనే చిన్న సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ మొదటి సినిమాతోనే హిట్ కొట్టడమే గాక మంచి పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత ప్లే బ్యాక్ అంటూ మరో మంచి కాన్సెప్ట్ తో వచ్చింది.

ఆ తరువాత అనన్య కి వరుస ఆఫర్లు రావడం స్టార్ట్ అయ్యాయి. అయితే అవి హీరోయిన్ వేషాలు కావు. పెద్ద సినిమాల్లో ముఖ్య పాత్రలు, హీరోయిన్ ఫ్రెండ్ రోల్స్, స్పెషల్ అప్పీరెన్స్ పాత్రలు అలాంటివి వచ్చేవి. ఈ సంవత్సరం శాకుంతలం, మళ్ళీపెళ్లి వంటి చిత్రాల్లో చిన్న పాత్రలు వేసింది. అయితే ప్లే బ్యాక్ తరువాత ఇప్పటివరకు హీరోయిన్ గా నటించలేదు అనన్య. పెద్ద సినిమాల్లో ఎలాగూ ఛాన్సులు రావు. అందుకే మళ్ళీ ఎవరైనా డైరెక్టర్ గాని, ప్రొడ్యూసర్ గాని అవకాశం ఇస్తే హీరోయిన్ గా తన ప్రతిభ చుపిస్తానంటుంది ఈ తెలుగమ్మాయి.

అయినా రీసెంట్ గా అంజలి, ఐశ్వర్య రాజేష్ వంటి తెలుగు హీరోయిన్లు కూడా తమ గుర్తింపు కోసం చాలా రోజులు వెయిట్ చేసారు. ఏది ఏమైనా ఇండస్ట్రీ వాళ్ళని గుర్తించే వరకు ఓపికతో ఉన్నారు. ఇప్పుడు అంజలి ఏకంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఎదో ఒకరోజు అనన్యకి లక్ కలిసొస్తుంది అని ట్రేడ్ పండితులు అంటున్నారు. ఇక తాజాగా ఈ అమ్మడి చేతిలో రెండు చిన్న సినిమాలున్నాయి. అయితే అవి పెద్దగా చెప్పుకోదగినవి కాదు. మరి ఆ రోజు ఎప్పుడొస్తుందో చూడాలి.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు