Anil ravipudi latest movie buzz: అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమా ఆ హీరోతోనే ?

Anil ravipudi latest movie buzz

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రస్తుతం నందమూరి బాలకృష్ణతో భగవంత్ కేసరి సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా తరువాత అనిల్ రావిపూడి ఏ సినిమా చేయబోతున్నాడనే విషయం పై ఇప్పటివరకు క్లారిటీ లేదు. కానీ గతకొద్ది రోజులుగా అనిల్ రావిపూడి మెగా కంపౌండ్ లో ఒక పెద్ద హీరో తో వర్క్ చేయబోతున్నట్టు ఒక న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న యువ దర్శకులలో అత్యంత సక్సెస్ రేట్ ఉన్న డైరెక్టర్ అనిల్ రావిపూడి అనే చెప్పాలి. డైలాగ్ రైటర్ గా కెరీర్ మొదలుపెట్టిన అనిల్ రావిపూడి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన పటాస్ సినిమాతో డైరెక్టర్ గా పరిచయమయ్యాడు. మొదటి సినిమానే బ్లాక్ బస్టర్ అవడంతో అనిల్ రావిపూడికి దర్శకుడిగా మంచి గుర్తింపును లభించింది.

ఇప్పటికి వరకు ఈ డైరెక్టర్ తీసింది కేవలం ఆరు సినిమాలే అయినప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమాలన్నీ ఘన విజయాన్ని సాధించాయి. ఆడియన్స్ పల్స్ పట్టుకొని కామెడీ ప్రధానంగా సినిమాలు తీసే ఈ దర్శకుడు ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ తో భారీ యాక్షన్ సినిమా తీస్తున్నాడు. ఇటీవలనే రిలీజ్ చేసిన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

- Advertisement -

ఇక భగవంత్ కేసరి సినిమా అక్టోబర్ 19న దసరా కానుకగా విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమా తరువాత అనిల్ రావిపూడి మెగా స్టార్ చిరంజీవితో సినిమా చేయడానికి రెడీ అయ్యాడని సోషల్ మీడియాలో ఒక న్యూస్ వైరల్ అవుతుంది. అయితే ఈ సినిమా అనిల్ రావిపూడి తాలూకా మార్క్ తో అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమాగా తెరకెక్కనుందని వార్త. చిరంజీవి ఇటీవల కాలంలో ఎక్కువగా మాస్ సినిమాలు చేస్తుండటంతో అనిల్ రావిపూడి చిరు తో కామెడీ ఎంటర్టైనర్ చేయడానికి రెడీ అవుతున్నట్టు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతానికి ఇది రూమర్ అయినప్పటికీ తొందర్లోనే ఈ కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్లనుందని స్ట్రాంగ్ బజ్.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు