NBK109: తండ్రి, కొడుకుల డబుల్ యాక్షన్ సినిమాలు ఇంకెన్నాళ్లు బాలయ్య

వాల్తేర్ వీరయ్య సినిమాతో ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవికి సాలిడ్ హిట్ సినిమాని అందించిన దర్శకుడు బాబీ కొల్లి ఆయన నెక్స్ట్ సినిమా నందమూరి బాలకృష్ణ తో చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలనే బాలకృష్ణ పుట్టిన రోజున లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా తొందర్లోనే సెట్స్ పైకి వెళ్లబోతుంది.

సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ కు రెడీ అయింది. గత కొద్దీ కాలంగా ప్రి ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా బాలయ్య- అనిల్ రావిపూడి ల భగవంత్ కేసరి సినిమా షూటింగ్ వల్ల కాస్తా డిలే అయింది. అయితే భగవంత్ కేసరి సినిమా షూటింగ్ దాదాపు అయిపొవస్తుండటంతో బాబీ- బాలయ్య సినిమా సెట్స్ పైకి వెళ్లబోతుంది.

కాగా ఈ సినిమా గురించి ప్రస్తుతం ఒక న్యూస్ ఇంటర్నెట్ లో వైరల్ అవుతుండగా, ఇది బాలకృష్ణ ఫ్యాన్స్ కు కాస్త ఇబ్బంది కలిగిస్తుందనే చెప్పాలి. గత కొద్దీ కాలంగా బాలకృష్ణ సినిమాలు చూస్తే అన్ని చిత్రాల్లో ఆయన డబుల్ యాక్షన్ చేస్తూ వస్తున్నారు. అందులో ఒకటి తండ్రి పాత్ర అయితే ఇంకోటి కొడుకు పాత్ర , ఒక పాత్రకు తెల్లగడ్డం, ఇంకో పాత్రకు నల్ల గడ్డం ఈ తంతు గత కొన్ని సంవత్సరాల నుంచి వస్తూనే ఉంది. అయిన కూడా జనాలు ఈయన సినిమాలు చూడటం మానెయ్యలేదు.

- Advertisement -

ఇక జనాలు చూస్తున్నారు కదా అని బాలకృష్ణ కూడా ఇదే రకమైన సినిమాలు చేస్తు వస్తున్నాడు. ప్రస్తుతం బాబీ కొల్లి దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో కూడా బాలయ్య బాబు మళ్ళీ డబుల్ యాక్షన్ చేస్తున్నాడు అని తెలియడంతో సోషల్ మీడియాలో ఈ విషయంపై నెగిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఇంకెన్ని రోజులు ఇవే పాత్రలు చేస్తాడు బాలయ్య అంటూ పరోక్షంగా ట్రోల్ చేస్తున్నారు. దాంతో బాలయ్య ఫ్యాన్స్ కూడా ఈ విషయం పట్ల అసహనంగా ఉన్నారు. ఆయన ఏజ్ కు తగినట్టు పాత్రలు చేయకుండా, రొమాన్స్ చేసే వయసా ఇది అని సోషల్ మీడియా కోడై కూస్తున్న మాకేం కనబడలేదు, వినిబడలేదన్నట్టు ప్రవర్తిస్తున్నారు బాలయ్య ఫ్యాన్స్. మరీ ఈ విషయం బాలయ్య దృష్టికి వెళ్లి ఆయన పద్దతిలో ఏమైనా మార్పు వస్తుందో లేదో చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు