Nachavule: ఆ డైరెక్టర్ మాధవి లతని అంతలా టార్చర్ చేశాడా..?

నాచురల్ స్టార్ నానితో కలిసి “నచ్చావులే” సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన హీరోయిన్ మాధవి లత గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈ సినిమా కంటే ముందు ఈమె కొన్ని సీరియల్స్ లో కూడా నటించింది. అయితే నచ్చావులే సినిమాతో మాత్రం పెద్దగా బ్రేక్ రాలేదు. ఇక తర్వాత మహేష్ బాబు హీరోగా వచ్చిన అతిధి సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గా నటించింది. ఇదిలా ఉంటే.. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనే పేరు చెప్పగానే మొదట మాధవి లత పేరే గుర్తుకొస్తుంది.

అలా గతంలో చాలా ధైర్యం చేసి తనని లైంగికంగా వేధించిన ఓ దర్శకుడి పేరు మీడియా వేదికగా చెప్పి సంచలనం సృష్టించింది మాధవి లత. ఇక అలా ఎప్పుడైతే ఈమె ఆ దర్శకుడి పేరు మీడియా ముందు బయటపెట్టిందో అప్పటి నుండి తెలుగులో అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. దీంతో చేసేదేం లేక సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఓ జాతీయ పార్టీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయింది. ఇక ఇటీవల ఈ చిన్నది మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ లో లేడీ అనే సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది.

అయినప్పటికీ ఈ సినిమా కూడా అంతగా సక్సెస్ కాలేదు. ఈ నేపథ్యంలో గతంలో ఈమె ఓ దర్శకుడు పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో ఏకంగా మీడియా ముందే ఓ దర్శకుడి పేరు బయటపెట్టినందువల్లనే ఈమె కెరీర్ నాశనమైందని, మంచి అవకాశాలు రావడంలేదని కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్లు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు