NBK’s Next Movie: ఈ టైమ్ లో రిస్క్ అవసరమా బాలయ్య..?

NBK’s Next Movie

నటసింహం నందమూరి బాలకృష్ణ ( Balakrishna ), డైరెక్టర్ బి. గోపాల్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అప్పట్లో సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు వంటి ట్రెండ్ సెట్టింగ్ సినిమాలతో టాలీవుడ్ పై బలమైన ముద్ర వేసిన కాంబినేషన్ ఇది. ఇప్పుడు మళ్ళీ ఈ కాంబినేషన్లో సినిమా రాబోతుందని టాక్ వినిపిస్తోంది. అప్పట్లో ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన బి గోపాల్ మస్కా సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకొని గోపీచంద్ తో చేసిన ఆరడుగుల బుల్లెట్ సినిమా డిజాస్టర్ కావడంతో మళ్ళీ బ్రేక్ పడింది. అయితే, అఖండ సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ అందుకొని ఊపు మీదున్న బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి, బాబీ వంటి యంగ్ డైరెక్టర్స్ తో క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్న నేపథ్యంలో ట్రాక్ లో లేని బి. గోపాల్ వంటి  సీనియర్ డైరెక్టర్ ఛాన్స్ ఇవ్వటం చర్చనీయాంశం అయ్యింది.

అఖండ బ్లాక్ బస్టర్, ప్లస్ అన్స్టాపబుల్ షో ద్వారా వచ్చిన క్రేజ్ తో 10కోట్ల వరకు ఉన్న రెమ్యునరేషన్ ని 20కోట్లు పెంచిన బాలయ్య ఇప్పుడు బి. గోపాల్ ఛాన్స్ ఇచ్చి పెద్ద రిస్క్ చేస్తున్నారని ఫ్యాన్స్ అంటున్నారు. బి. గోపాల్ అప్పట్లో హిట్స్ ఇచ్చిన సీనియర్ డైరెక్టర్ అయినప్పటికీ ఇప్పుడు చాలా గ్యాప్ రావటంతో ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ని పట్టుకోగలడా అన్న అనుమానం వస్తుంది.

అయితే, బాలకృష్ణ సినిమాలన్నీ ఇప్పుడు మాస్ ఎలిమెంట్స్ తో డ్యూయల్ రోల్ తో ఒకే ఫార్మాట్ లో వస్తున్న నేపథ్యంలో ఈ ఫార్మాట్ కి, పెట్టింది పేరైన బి. గోపాల్ ప్రజెంట్ జనరేషన్ పల్స్ ని కనుక పట్టుకొని స్క్రిప్ట్ సిద్ధం చేస్తే అప్పటి రిజల్ట్ రిపీట్ అయ్యే అవకాశం ఉంది. మరి, ఎలాంటి అఫీషియల్ ఇన్ఫో లేని ఈ కాంబినేషన్ కార్యరూపం దాల్చుతుందా లేదా అన్నది తెలియాలంటే వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు