Bollywood: ఆ హీరో కోసం బట్టలన్నీ విప్పేశాను.. హీరోయిన్ రంభ హాట్ కామెంట్స్..!

Heroine Rambha comments..!

30 ఏళ్ల క్రితం ‘ఆ ఒక్కటి అడక్కు’ సినిమాతో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన రంభ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ రంభ. బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో సినీ పరిశ్రమంలో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది. తెలుగులోనే కాకుండా తమిళ్, మలయాళ భాషలలో కూడా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించింది. ఈ ముద్దుగుమ్మ ఆంధ్ర ప్రదేశ్ లోని విజయవాడ తెలుగు కుటుంబంలో జన్మించింది.

అందంలోనూ, డాన్స్ లోనూ, నటనలోను ఈమెకి సాటి వచ్చే హీరోయిన్స్ ఇప్పటికీ లేరంటే అతిశయోక్తి కాదు. ఇక ఈమె 2010లో కెనడా కి చెందిన వ్యాపారవేత్త ఇంద్ర కుమార్ ని వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత సినీ ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైంది రంభ. ఈమెకి ఇద్దరు కూతుర్లు, ఓ కుమారుడు ఉన్నారు. ఈమె ప్రస్తుతం సినీ పరిశ్రమకి దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫ్యామిలీకి సంబంధించిన అన్ని విషయాలను తన ఫాలోవర్లతో పంచుకుంటూ ఉంటుంది.

అయితే ఆమధ్య ఓ ఇంటర్వ్యూలో రంభ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. అదేంటంటే.. తెలుగులో బ్లాక్ బస్టర్ గా నిలిచిన అక్కినేని నాగార్జున హలో బ్రదర్ చిత్రాన్ని హిందీలో సల్మాన్ ఖాన్ జుద్వా అనే పేరుతో రీమేక్ చేశారు. అక్కడ కూడా ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. అయితే ఈ చిత్రంలో తనకి ఇష్టం లేకపోయినా చాలా హద్దులు దాటి అందాలను ఆరబోయాల్సి వచ్చిందట. కొన్ని కొన్ని సార్లు మనకి ఇష్టం లేకపోయినా పనులు కూడా ఒప్పుకున్నందు వల్ల చేయాల్సి వస్తుందని.. అలా చేసిన సినిమానే ఇది అని చెప్పుకొచ్చింది.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు