Custody: నాగచైతన్యకు ఇంతమందితో ఎఫైర్ ఉందా?

Did Naga Chaitanya have an affair with these people?

టాలీవుడ్ స్టార్ హీరో నాగచైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం వరుస ఫ్లాప్ లతో సతమతమవుతున్నారు నాగ చైతన్య. లవ్ స్టోరీ తర్వాత నాగచైతన్యకు సాలిడ్ హిట్టే లేదు. సోగ్గాడే క్రేజ్ తో బంగార్రాజు జస్ట్ బ్రేక్ ఈవెన్ మార్క్ ను టచ్ చేసింది. ఇక ఆ తర్వాత వచ్చిన థాంక్యూ రెండో రోజే దుకాణం సర్దేసింది.

మనం వంటి మర్చిపోలేని హిట్ ఇచ్చిన విక్రమ్ కే కుమార్ సైతం ఈసారి నాగ చైతన్యను కాపాడలేకపోయాడు. గంపడంత ఆశలు పెట్టుకున్నా లాల్ సింగ్ చద్దా బాలీవుడ్ హిస్టరీలోనే అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. ఈ దెబ్బతో చైతన్య బాలీవుడ్ వైపు చూడటమే మానేశాడు. ఇక వెంకట్ ప్రభు వంటి కమర్షియల్ దర్శకుడిని నమ్ముకున్న… కస్టడీ రూపంలో తేరుకోలేని దెబ్బ పడింది. ప్రస్తుతం నాగచైతన్య ఓ భారీ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు.

ఈ క్రమంలో చందు మొండేటితో ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కు సంతకం చేశాడు. అయితే సమంతతో మాత్రమే కాకుండా చైతన్య లవ్ ఎఫైర్లు నడిపిన హీరోయిన్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. 2011 లో వచ్చిన ‘దడ’ సినిమాతో నాగచైతన్యకు జంటగా కాజల్ నటించింది. ఆ సమయంలో వీళ్ళ ఇద్దరి మధ్య ఎఫైర్ నడుస్తున్నట్లు వార్తలు వినిపించాయి. అలాగే ‘ప్రేమమ్’ సినిమాలో శృతిహాసన్ ఓ కీలక రోల్ నటించినప్పుడు చైతన్య శృతితో కూడా ప్రేమాయణం నడిపినట్లు వార్తలు వచ్చాయి. ఇక సమంతతో విడాకులు తీసుకున్నాక చైతు… శోభిత దూళిపాళ్లతో ఎఫైర్ పెట్టుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు హాట్ హాట్ గా వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై శోభిత స్పందించి… మేము ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అని చెప్పినప్పటికీ కూడా ఈ వార్తలకు ఇంకా బ్రేక్ పడలేదు.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries.

Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు