Devara: ఎన్టీఆర్ తో ఆ పని చేసేందుకు… దేవుడిని ప్రార్థించా !

Janhvi Kapoor About Devara Movie

దివంగత నటి శ్రీదేవి, ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ ల ముద్దుల కూతురు జాన్వీ కపూర్ సౌత్ మూవీస్ పై కాన్సన్ట్రేట్ చేసింది. “దడక్” మూవీతో బాలీవుడ్ లో హీరోయిన్ గా అడుగుపెట్టిన ఈ భామ నటిగా మంచి పేరు తెచ్చుకుంది. అయితే యంగ్ హీరోయిన్ జాన్వి కపూర్ బాలీవుడ్ లో వరుస చిత్రాలు చేసినప్పటికీ అనుకున్నంత హీట్ మాత్రం అందుకోలేకపోయింది. దీంతో జాన్వి సౌత్ ఇండస్ట్రీలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది.

ఈ క్రమంలోనే గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ సరసన ‘దేవర’ మూవీతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. ప్రస్తుతం ఈ మూవీ సెట్స్ పై ఉండగానే… మరో సౌత్ ప్రాజెక్టులో నటించేందుకు జాన్వి సిద్ధమైనట్లు తెలుస్తోంది. లేడీ సూపర్ స్టార్ నయనతార భర్త విగ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందనున్న ఇంట్రెస్టింగ్ మూవీలో జాన్విని ఫిమేల్ లీడ్ గా ఎంపిక చేసినట్లు సమాచారం.

అయితే తాజాగా జాన్వి కపూర్ బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ తో కలిసి అభిమానులతో చిట్ చాట్ చేసింది. ఇందులో భాగంగా మాట్లాడిన ఆమె…’ఎన్టీఆర్-కొరటాల శివ మూవీని ప్రకటించినప్పటి నుంచి ఎలాగైనా ఈ సినిమాలో నాకు అవకాశం కల్పించాలని భగవంతుడిని ప్రార్థించాను. మొత్తానికి సెలెక్ట్ చేశారు. చాలా ఆనందంగా ఉంది’ అంటూ చెప్పుకొచ్చింది.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries.

Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు