Trisha beauty secret: అందంగా కనిపించేందుకు ఆ పనులు చేస్తున్న త్రిష ?

Trisha beauty secret

ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ నటి త్రిష భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. అభిమానులు సౌత్ క్వీన్ గా పిలుస్తారు. వ్యక్తిగత కారణాలవల్ల సినిమాలకు దూరమైనప్పటికీ ఇటీవలే మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన ఈ భామ తమిళంలో వరస సినిమాలు చేస్తూ అక్కడే సెటిల్ అయిపోయింది.

ఇక నాలుగు పదుల వయసులో కూడా ఇంకా పెళ్లి చేసుకున్న సింగిల్ గానే ఉంటూ సింగిల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది. అలాంటి ఈ హీరోయిన్ ఇప్పటికే ఎంతోమంది హీరోలతో ప్రేమలో పడి బ్రేకప్ చెప్పుకుంది. ఇక ఈ మధ్యనే “పోన్నియిన్ సెల్వన్” చిత్రంతో యువరాణి కుందవై పాత్రలో నటించి సాలిడ్ కం బ్యాక్ ఇచ్చింది. ముఖ్యంగా ఐశ్వర్యరాయ్ కంటే త్రిషకే ఎక్కువ పేరు వచ్చింది. నాలుగు పదుల వయసులోనూ 20 ఏళ్ల అమ్మాయిల కనిపిస్తుందంటూ త్రిష అందానికి సెలబ్రిటీలు కూడా ఆశ్చర్యపోయారు.

మరి ఇంత అందంగా కనిపించడానికి త్రిష ఏం చేస్తుంది అని అడిగితే ఆమె ఏం చెప్పిందంటే… “గ్రీన్ టీ….లేదా గ్లాసుడు గోరువెచ్చని నీటిలో కాస్తంత నిమ్మ చుక్కలతో నా ‘డే’ మొదలవుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది మిస్ అవ్వను. నా మెన్యులో జంక్ ఫుడ్ కి చోటు లేదు. కంటి నిండా నిద్ర కరువయ్యే ఛాన్స్ లేదు. మొత్తం మీద డిసిప్లిన్ లైఫ్ స్టైల్ నా బ్యూటీ సీక్రెట్”. అంటూ పేర్కొంది.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు