Trisha: స్టార్ హీరోయిన్ తెలుగులో రీఎంట్రీ ఇస్తుందా..?

వర్షం సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది చెన్నై భామ త్రిష. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకొని స్టార్ హీరోల సరసన వరుస ఆఫర్లు సంపాదించి తెలుగులో టాప్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. తెలుగు తమిళ భాషల్లోనే కాకుండా బాలీవుడ్ సినిమాల్లో కూడా ఆఫర్లు సంపాదించింది త్రిష.మణిరత్నం డైరెక్షన్లో ఇటీవల వచ్చిన పొన్నియన్ సెల్వన్ సినిమా ద్వారా త్రిషకి ప్రశంసలు దక్కాయి. హీరోయిన్ గా తన ప్రస్థానం మొదలు పెట్టి 20సంవత్సరాలు దాటుతున్నా ఏ మాత్రం తరగని అందంతో అందరిని ఆశ్చర్య పరుస్తోంది త్రిష. అయితే త్రిష తెలుగులో స్ట్రైట్ సినిమా చేసి చాలా కాలం అయ్యింది. పొన్నియన్ సెల్వన్ సినిమాలో త్రిష అందానికి అభినయానికి ఫిదా అయిన అభిమానులు, తమ అభిమాన హీరోయిన్ తెలుగులో సినిమా ఎప్పుడు చేస్తుందా అని ఎదురు చూస్తున్నారు.

ఈ నేపథ్యంలో త్రిషకి ఒక తెలుగు సినిమా ఆఫర్ వచ్చిందంటూ ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. వివరాల్లోకి వెళితే, మాస్ మహారాజ రవితేజ, జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ తో కలిసి ఓ కామెడీ సినిమా ప్లాన్ చేస్తున్నారని, ఆ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం తమన్నా, త్రిషల పేర్లను పరిశీలిస్తున్నారని సమాచారం అందుతోంది. ఇదే గనక నిజం అయితే, త్రిష చాలా కాలం తర్వాత తెలుగు సినిమాలో కనిపించి అలరిస్తుంది. రవితేజ త్రిష కాంబినేషన్లో కృష్ణ లాంటి సూపర్ హిట్ సినిమా ఉండటంతో ఈ కాంబినేషన్ పై ఆసక్తి నెలకొంది.

ఇటీవల రవితేజ నటించిన ప్రయోగాత్మక చిత్రం రావణాసుర అనుకున్న స్థాయిలో అలరించలేదు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలకు పెట్టింది పేరైన రవితేజని నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో యాక్సెప్ట్ చేయలేకపోయారు ఆడియన్స్. స్క్రిప్ట్ లో ఉన్న థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ స్క్రీన్ మీద కనిపించకపోవడం వల్ల ఆ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. రావణాసుర రిజల్ట్ తో తప్పు తెలుసుకున్న రవితేజ కామెడీ సినిమా చేయాలని డిసైడ్ అయ్యాడట. మరి, ఇంత కాలానికి వచ్చిన తెలుగు సినిమా ఆఫర్ ని త్రిష యాక్సెప్ట్ చేస్తుందా లేదా చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు