Waltair Veerayya 200 days: సినీ ఇండస్ట్రీపై బ్రహ్మస్త్రం ఎందుకు? చిరు కామెంట్స్ వైరల్

Waltair Veerayya 200 days celebrations

రాజకీయాలకు దూరంగా ఉంటూ,వరుస సినిమాలు చేస్తున్న మెగా స్టార్ చిరంజీవి చాలా రోజుల తరువాత ఒక పొలిటికల్ సైటర్ వేసాడు. ఆయన గత చిత్రమైన వాల్తేరు వీరయ్య సినిమా 200 డేస్ ఫంక్షన్ లో పాల్గొన్న ఆయన స్టేజ్ పైన పలు పొలిటికల్ పంచ్ లు వేయగా, అవి ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి.

రెండు రోజుల క్రితమే జరిగిన భోళా శంకర్ ప్రి రిలీజ్ ఈవెంట్ లో పలువురు అసందర్భంగా పోలిటికల్ స్పీచ్ లు ఇచ్చిన కూడా, సైలెంట్ గా విని వదిలేసిన మెగా స్టార్. ఇప్పడు ఆయన ఈ రకంగా పొలిటికల్ కామెంట్స్ చేయడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో చిరంజీవి, రవితేజ కలిసి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా జనవరిలో రిలీజై, బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. చిరంజీవి కంబ్యాక్ ఇచ్చిన తరువాత నుంచి చేసిన అన్ని సినిమాల్లోకెల్లా వాల్తేరు వీరయ్య సినిమానే అతిపెద్ద విజయం సాధించింది. దాంతో ఈ సినిమా సక్సెస్ ను సెలెబ్రేట్ చేస్తూ వాల్తేరు వీరయ్య 200 డేస్ ఫంక్షన్ నిర్వహించారు మేకర్స్.

- Advertisement -

అయితే ఈ ఫంక్షన్ కు హాజరైన మెగా స్టార్ చిరంజీవి స్టేజ్ పై మాట్లాడుతూ ” ప్రత్యేక హోదా గురించి కానీ , రోడ్ల నిర్మాణం గురించి కానీ ప్రాజెక్టులు గురించి కానీ పేదవారికి కడుపు నింపే విషయం కానీ,ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం గురించి కానీ, ఏపీ పొలిటికల్ లీడర్స్ కలుగాజేసుకోవాలి అలా కాకుండా పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లా సినిమా ఇండస్ట్రీ మీద పడతారేంటి ” అంటూ ఆయన మాట్లాడుకొచ్చాడు. అయితే ఇటీవలనే పవన్ కళ్యాణ్ నటించిన బ్రో సినిమా వివాదాస్పదం కాగా చిరంజీవి ఆ వివాదాన్ని మైండ్ లో పెట్టుకునే ఈ కామెంట్స్ చేసినట్టు తెలుస్తుంది. మరీ చిరంజీవి వ్యాఖ్యలకు రియాక్షన్ ఎలా ఉండబోతుందో చూడాలి.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు