Ivana BOLD comments : ఆ మాటలు నన్ను చాలా బాధపెట్టాయి..

Ivana BOLD comments

లవ్ టుడే బ్యూటీ ఇవానా హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన మొదట్లో చాలా అవమానాలు ఎదుర్కొందట. ఇండస్ట్రీలో దాదాపు హీరోయిన్స్ అందరు ఫెస్ చేసే బాడీ షేమింగ్ ఇబ్బందులకు ఇవానా కూడా గురి అయిందట ఆమె లేటెస్ట్ గా నటించిన LGM సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కెరీర్ బిగినింగ్ లో ఆమె పడిన ఇబ్బందులను ఇవానా బయట పెట్టింది.

ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వంలో వచ్చిన లవ్ టుడే సినిమాతో హీరోయిన్ పరిచయమైన ఇవానా మొదటి సినిమాతోనే ప్రేక్షకుల్లో మంచి మార్కులు కొట్టేసింది. చిన్న సినిమాగా రిలీజైన లవ్ టుడే సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద విజయం సాధించటంతో ఇవానా యంగ్ హీరోల సినిమాలకు మొదటి ఛాయిస్ గా మారింది. ప్రస్తుతం దిల్ రాజు ప్రొడక్షన్స్ లో రౌడీ బాయ్స్ ఫేం ఆశిష్ రెడ్డి హీరోగా రాబోతున్న లేటెస్ట్ సినిమా సెల్ఫిష్ లో హీరోయిన్ గా నటిస్తోంది ఈ బ్యూటీ.

అయితే ఇవానా నటించిన LGM సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆమె కొన్ని ఆసక్తి కార వ్యాఖ్యలు చేసింది. ఒక స్టార్ హీరో సినిమాలో హీరోయిన్ గా ఇవానాకు హీరోయిన్ గా అవకాశం వచ్చిందట, కానీ ఆమె పొట్టిగా ఉండటం వల్ల ఆ సినిమా అవకాశం చేజారిపోయింట. తాను హైట్ తక్కువ ఉండటం కారణంగా ఇండస్ట్రీలో చాలా అవమానాలు ఎదుర్కొందట. అంతేకాదు లవ్ టుడే సినిమా చేస్తున్న సమయంలో కూడా ఇవానా హైట్ గురించి చాలా మంది కామెంట్స్ చేసేవారంట. కానీ ఆ కామెంట్స్ అన్నీ తనకు చిన్నతనం నుండి అలవాటు అవడం వల్ల పట్టించుకోకుండా సినిమాలు చేస్తున్న అంటూ ఆమె చెప్పుకొచ్చింది.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు