Ivana: LGM ట్రయిలర్… రిలీజ్ కి ముందే స్టోరీ చెప్పేసారుగా!

ఇండియన్ గ్రేటెస్ట్ క్రికెట్ ప్లేయర్, మరియు కెప్టెన్ అయిన మహేంద్ర సింగ్ ధోని నిర్మాతగా మారి ఓ సినిమా చేస్తున్నాడన్న సంగతి తెలిసిందే. “LGM” పేరుతో తమిళంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను “రమేష్ తమిళ్ మణి” అనే దర్శకుడు డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో హరీష్ కళ్యాణ్ హీరో గా నటించగా , ఇవానా హీరోయిన్ గా నటించింది. నదియా, యోగి బాబు, rj విజయ్, విశ్వజిత్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా యొక్క ట్రైలర్ మంచి రెస్పాన్స్ దక్కించుకుంది.

ఇక LGM అంటే లెట్స్ గెట్ మ్యారిడ్ అని అర్ధం అని మేకర్స్ తెలియచేసారు. ఇక ట్రైలర్ ని గమనిస్తే సినిమాలో హీరో గౌతమ్ హీరోయిన్ ని రెండేళ్లుగా ప్రేమిస్తుంటాడు. ఒకానొక సమయంలో హీరోయిన్ ఐ లవ్ యు అని చెప్పేస్తుంది. అయితే హీరోయిన్ మాత్రం తాను, తన భర్త తో తప్ప ఎవ్వరితోను ఉండనని అంటుంది. అందుకు హీరో ఒప్పుకోకపోగా, ఇద్దరు ఒక ఒప్పందానికి వస్తారు. హీరో తన తల్లి ఇంకా తన లవర్ తో పాటు ఇంకొంతమందితో కలిసి ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తాడు. అక్కడితో కథ ఏ మలుపు తిరిగింది. ఫైనల్ గా హీరో, హీరోయిన్లకు పెళ్లి జరిగిందా? లేదా అనేదే కథ.

- Advertisement -

అయితే ట్రైలర్ మొత్తంలోనే కథ చెప్పేసిన డైరెక్టర్ సినిమాలో ఇంకేం చూపిస్తాడని అంటున్నారు. ఇక ధోని ఫ్యాన్స్ అయితే ధోని లాంటి సెలబ్రిటీ వచ్చి సినిమా ఛాన్స్ ఇస్తే ఇలాంటి మామూలు సినిమా తీస్తారా అంటూ చిత్ర యూనిట్ ని ట్రోల్ చేస్తున్నారు. అయితే ట్రైలర్ కామెడీ తో ఉండి ఆకట్టుకుంది. సినిమాపై నెగిటివ్ ప్రచారం చేసే వాళ్ళకి ముందుగా సినిమా చూసి మాట్లాడితే బాగుంటుందని తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే LGM సినిమా రిలీజ్ డేట్ మాత్రం ఇంకా ప్రకటించలేదు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates,Gossips, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు