Sarkaru naukari: కొడుకు కోసం అన్ని దగ్గరుండి చూసుకుంటున్న సింగర్?

టాలీవుడ్ లో టాప్ మోస్ట్ పాపులర్ ఫిమేల్ సింగర్స్ లో ఒకరు సునీత. లెజెండరీ సింగర్ చిత్ర తర్వాత ఆ రేంజ్ పాపులారిటీ సంపాదించిన సునీత ఎన్నో పాటల ద్వారా మనకు సుపరిచితమే. ఇక రీసెంట్ గా రెండో పెళ్లి కూడా చేసుకున్న సింగర్ సునీత తన పిల్లలతో మాత్రం కలిసి ఉంటుంది.ఇక తాజాగా సునీత పెద్ద కొడుకు అయిన ఆకాష్ గోపరాజు ని హీరోగా పరిచయం చేస్తూ కే రాఘవేంద్ర రావు “సర్కారు నౌకరి” అనే సినిమా నిర్మిస్తున్నారు.

ఇక గంగనమోని శేఖర్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇటీవల రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ డీసెంట్ గా ఉండి ఆకట్టుకుంది. 90స్ లో జరిగే కథగా ఈ సినిమాని తెరకెక్కిస్తుండగా, త్వరలోనే రిలీజ్ కి రెడీ అవుతుంది. అయితే ఈ సినిమాకి గాను సింగర్ సునీత దగ్గరుండి అన్ని పనులు చూసుకుంటుంది. పేరుకి రాఘవేంద్రరావు నిర్మాణంలోనే ఈ సినిమా వస్తున్నా కూడా, ఈ సినిమాలో తన కొడుకు ఆకాష్ హీరోగా నటిస్తున్నాడు కాబట్టి, దగ్గరుండి సినిమాకి సంబంధించిన పనుల్లో పాల్గొంటుంది.

ఇక తాజాగా సర్కారు నౌకరి సినిమాకి గాను ఒక ప్రమోషనల్ సాంగ్ ని రెడీ చేసారు. ఈ పాటని స్వయంగా సింగర్ సునీత, హారిక నారాయణ్, సాహితి చాగంటిలతో కలిసి పాడారు. ఇక సినిమా రిలీజ్ కి ఇంకా చాలా టైం ఉన్నా, ప్రమోషన్ పనుల్లో మాత్రం సునీత బిజీ గా ఉంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Gossips, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు