Sri simha: “ఉస్తాద్” మరోసారి వాయిదా పడనుందా?

శ్రీ సింహ కోడూరి హీరోగా “ఉస్తాద్” అనే సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. వారాహి చలన చిత్రం, క్రిషి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ లో రజిని కొర్రపాటి, రాకేష్ రెడ్డి గడ్డం సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు ఫణిదీప్ దర్శకత్వం వహించాడు. బలగం ఫేమ్ కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్ గా నటించగా, డైరెక్టర్ కం యాక్టర్ గౌతమ్ మీనన్ ఈ మూవీ లో ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు.

అయితే ఉస్తాద్ సినిమా జూన్ లోనే రిలీజ్ కావల్సి ఉండగా, శ్రీ సింహా మరో సినిమా “భాగ్ సాలే” రిలీజ్ డేట్ ముందుగా కన్ ఫర్మ్ చేసుకోవడంతో ఈ సినిమా రిలీజ్ ని పోస్ట్ పోన్ చేసారు. ఇక రీసెంట్ గా భాగ్ సాలే మూవీ రిలీజ్ అయి ప్లాప్ అయింది. దాంతో శ్రీ సింహా ఉస్తాద్ పైనే హోప్స్ పెట్టుకున్నాడు. అయితే రీసెంట్ గా ఉస్తాద్ రిలీజ్ డేట్ ఆగష్టు 12 న ఫిక్స్ చేసుకోగా ఇప్పుడు ఆ డేట్ కి కూడా రాదని, రిలీజ్ మళ్ళీ వాయిదా పడుతుందని అంటున్నారు.

ఎందుకంటే ఉస్తాద్ విడుదలకు రెండు రోజుల ముందే, అంటే ఆగష్టు 10న సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ విడుదల అవుతుండగా, 11న మెగాస్టార్ చిరంజీవి నటించిన “భోళా శంకర్” రిలీజ్ అవుతుంది. ఈ సినిమాల మధ్య ఉస్తాద్ లాంటి చిన్న సినిమాని ఆడియన్స్ అంత పట్టించుకోరని ట్రేడ్ పండితులు అంటున్నారు. ఒక వేళ సినిమా బాగున్నా కూడా థియేటర్ల సమస్య తలెత్తుతుంది. అందువల్ల ఉస్తాద్ సినిమాను వాయిదా వేయడమే మంచిదని నెటిజన్లు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి మేకర్స్ ఎలా ప్లాన్ చేస్తున్నారో చెప్పలేం.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు