Project K: ఏదో దేవకన్యని చూపిస్తున్నట్టు బిల్డప్ ఇచ్చారుగా?

టాలీవుడ్ లో రూపొందుతున్న క్రేజీ సినిమాల్లో ఒకటి ప్రాజెక్ట్ K. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వినిదత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి లెజెండరీ నటులతో పాటు, హీరోయిన్లుగా దీపికా పదుకొనె, దిశా పటాని నటిస్తున్నారు.

అయితే ప్రాజెక్ట్ K మొదలై దాదాపు సంవత్సరం కావస్తున్నా ఇప్పటివరకు ఒక్క ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయని మేకర్స్ సినిమాపై హైప్ మాత్రం పెంచుకుంటూనే వస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ నిరీక్షణ కి తెర దించుతూ, జులై 17న రాత్రి 11గంటలకు దీపికా పదుకొనె ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు. అయితే ఈ ఫస్ట్ లుక్ నిన్న సాయంత్రం 5గంటలకే రిలీజ్ కావాల్సి ఉండగా, టెక్నికల్ ఇష్యూ వల్ల లేట్ అవుతుందని చెప్పారు. ఇది పెద్ద సినిమాలకు క్యూరియాసిటీ పెంచడం కోసం ఇప్పుడు వాడుతున్న టెక్నిక్. అలాగే వీళ్ళు కూడా చేసారు.

అయితే చాలా సేపు వెయిట్ చేసి చేసి, తీరా ఫస్ట్ లుక్ రివీల్ చేసాక అభిమానులు మాత్రం పెదవి విరుస్తున్నారు. ఫస్ట్ లుక్ ని గమనిస్తే దీపికా పదుకునే ఎదో ఇంట్లో నిద్రలోంచి లేచి దుప్పటి కప్పుకుని కూర్చున్నట్టు చూపించారు. దీపికా ఫ్యాన్స్ ఆమెను ఒక దేవకన్యలా ఇంట్రడ్యూస్ చేస్తారని భావించారు. కానీ ఈ లుక్ చూసాక ప్రభాస్ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి రాబోయే లుక్స్ అయినా మేకర్స్ శ్రద్ధ పెట్టి ఆడియన్స్ కి నచ్చేలా డిజైన్ చేయాలని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. మరి జులై20న రిలీజ్ అవుతున్న గ్లింప్స్ తో ఏ మేరకు మెప్పిస్తారో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు