Ivana: అయ్యో.. పాపం లవ్ టుడే హీరోయిన్ పరిస్థితి ఏంటి ఇలా అయిపోయింది

లవ్ టుడే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఇవానా గురించి అందరికి తెలిసిందే. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈ మలయాళీ భామ.

ప్రదీప్ రంగనాథన్ డైరెక్షన్ లో వచ్చిన ఈ లవ్ టుడే గతేడాది రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయాన్ని సాధించింది. కేవలం 5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా దాదాపు 100 కోట్ల వరకు వసూలు చేసింది. తెలుగులో ఈ సినిమాని దిల్ రాజు రిలీజ్ చేయగా, ఇక్కడ కూడా ఈ సినిమా ఘన విజయాన్ని సాధించింది.

ప్రస్తుతం ఈ సినిమాని హిందీలో బోనీ కపూర్ రెండవ కూతురు ఖుషి కపూర్ హీరోయిన్ గా, అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ హీరోగా రీమేక్ చేయబోతున్నారు.

- Advertisement -

అయితే సాధారణంగా ఒక సినిమా యావరేజ్ గా ఆడిన కూడా కొంతమంది హీరోయిన్స్ వరుస పెట్టి సినిమాలు సినిమాలు చేస్తుండగా, ఈ బ్యూటీకి మాత్రం అవకాశాలు కరువయ్యాయి. లవ్ టుడే సినిమా రిలీజ్ అయ్యి చాలా రోజులే అవుతున్న ఈ హీరోయిన్ సినిమాల గురించి మాత్రం అప్డేట్స్ ఏమి లేవు.

ప్రస్తుతం ఇవానా LGM అనే ఒక తమిళ్ సినిమా చేస్తుంది. ఇటీవలనే ఈ సినిమాకి సంబంధించి టీజర్ కూడా రిలీజయింది. ప్రముఖ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని భార్య ఈ సినిమాకి ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.
ఈ సినిమాతో పాటు ఇవానా తెలుగులో సెల్ఫిష్ అనే సినిమా చేస్తుంది. అయితే ఈ రెండు సినిమాలు కూడా మీడియం బడ్జెట్ సినిమాలే.

ఇవానా రేంజ్ లో ఉన్న హీరోయిన్స్ అంత వరుస సినిమాలతో దూసుకుపోతుంటే లవ్ టుడే లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఈ అమ్మడు మాత్రం ఒకటి అర సినిమాలతో అడ్జస్ట్ అయిపోతుంది. పెద్ద హీరోలు, పెద్ద ప్రొడక్షన్స్ ల చూపు కూడా ఈ హీరోయిన్ పై పడట్లేదు. దాంతో అంత ఇవానా కూడా ఫేడ్ అవుట్ హీరోయిన్ల లిస్ట్ లో పడిపోయిందని, అంత పెద్ద హిట్ కొట్టిన ఇలాంటి పరిస్థితి వచ్చిందేంటా అని సోషల్ మీడియాలో అంత పోస్ట్ వేస్తున్నారు. కాగా LGM సినిమా మొదటి పాట ఈ రోజు విడుదలవబోతుంది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు