Mega Prince :పెళ్లికి ముందే లావణ్య – వరుణ్ విడాకులపై అగ్రిమెంట్ తీసుకున్నారా..?

టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ – అందాల భామ లావణ్య త్రిపాఠిల నిశ్చితార్థం జూన్ 9వ తేదీన సాయంత్రం హైదరాబాద్ లోని నాగబాబు నివాసంలో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎంగేజ్మెంట్ కి మెగా, అల్లు, లావణ్య కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు విచ్చేసి కాబోయే దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ మారిన విషయం కూడా తెలిసిందే. అయితే ఇప్పుడు వీరు పెళ్లికి ముందే ఓ అగ్రిమెంట్ పై సైన్ చేశారంటూ సోషల్ మీడియాలో ఓ వార్త పెద్ద ఎత్తున వైరల్ గా మారింది. అదేంటంటే.. పెళ్లికి ముందే లావణ్య కు వరుణ్ తేజ్ కొన్ని కండిషన్స్ పెట్టాడట. ఆ కండిషన్స్ న్యాయబద్ధంగా ఉండడంతో లావణ్య కూడా ఆ కండిషన్స్ కి ఒప్పుకుందట. అంతేకాదు లావణ్య కూడా వరుణ్ తేజ్ కి ఓ కండిషన్ పెట్టిందట.

పెళ్లి అయ్యాక చాలామంది సెలబ్రిటీలు కొన్ని విషయాలలో అభిప్రాయ భేదాలు రావడంతో విడాకుల బాట పడుతున్నారు. అయితే ఈ విషయంలో తమ మధ్య గొడవలు రాకూడదన్న ఉద్దేశంతో ముందుగానే ఇలా అగ్రిమెంట్ చేసుకున్నారట లావణ్య – వరుణ్. పెళ్లి తర్వాత ఏదైన మనస్పర్ధలు వచ్చి విడాకులు తీసుకోవాలనుకుంటే ఇద్దరికీ సంబంధించిన ఆస్తిలో ఎవరికీ హక్కు ఉండకుండా ఉండేలా అగ్రిమెంట్ రెడీ చేసి దానిపై సంతకం చేశారట.

- Advertisement -

అంటే లావణ్య ఆస్తులపై వరుణ్ కి, వరుణ్ ఆస్తులపై లావణ్య కు ఎటువంటి అధికారం ఉండదని.. వాళ్లు కలిసి ఉన్నప్పుడు సంపాదించుకున్న ఆస్తిపై మాత్రమే వాళ్లకు పూర్తి హక్కులు ఉంటాయని స్పెషల్ అగ్రిమెంట్ రాయించుకొని మరి సైన్ చేయించుకున్నరట. ఇందులో నిజం ఎంతుందో తెలియదు కానీ.. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు