Manu Charitra: మేఘకి నమ్మకంగా ఉన్నా కెరీర్ పై ఆడియన్స్ కి నమ్మకం లేదు

మేఘ ఆకాష్ ఆశలు వదులుకోవట్లేదు. ఇంకా ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంది. టాలీవుడ్ ఆడియన్స్ ఈమెని ఎప్పుడు యాక్సప్ట్ చేస్తారో తెలియదు గాని, తాను మాత్రం వీలైనంతవరకు ట్రై చేస్తుంది. విషయానికి వస్తే చెన్నై కి చెందిన ఈ భామ అప్పుడెప్పుడో 2017లో వచ్చిన “లై” సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా డిజాస్టర్ అయ్యి కెరీర్ మొదట్లోనే గట్టి దెబ్బ కొట్టింది. ఆ తర్వాత చేసిన ఏ ఒక్క సినిమా కుడా ఆడలేదు. ఏ భాషలో సినిమా చేసినా ప్లాపులు రావడం కామన్ అయిపొయింది. ఒకవేళ ఏదైనా హిట్ అయినా అందులో ఎదో సైడ్ రోల్ మాత్రమే చేసింది.

తెలుగులో చేసిన రాజరాజచోరా పర్వాలేదనిపించగా ఆ సినిమా వల్ల మేఘ కి ఒరిగిందేమి లేదు. రీసెంట్ గా వచ్చిన “బూ” సినిమా కూడా బాగాలేదు. అయినా అది ఓటిటి లో వచినందువల్ల చాల మందికి తెలియదు కూడా. ఇక చివరి ప్రయత్నమో, లేక ఎక్కడో ఆశ ఉందొ ఇప్పుడు “మను చరిత్ర” సినిమాతో వస్తుంది. ఈ మధ్యనే విడుదలైన ఆ సినిమా ట్రైలర్ ఆకట్టుకుంది. మరి సినిమా హిట్ అవుతుందని మేఘ చాలా నమ్మకంతో ఈ సినిమా పై ఆశలు పెట్టుకుంది.

అయితే ఈ సినిమా ట్రైలర్ చూసిన చాలా మంది ట్రైలర్ బాగున్నా, ఈ సినిమాలో మేఘా ఆకాష్ కి తగిన రోల్ ఇవ్వలేదని అంటున్నారు. ఒక వేళ ఈ సినిమా హిట్ అయినా కూడా దానివల్ల మేఘ కి పెద్ద లాభం ఉండదని తన సినిమా ప్రయత్నాలు తిరిగి కొనసాగించాలని నెటిజన్స్ అంటున్నారు. లేకపోతే మేఘ ఆకాష్ కెరీర్ తెలుగులో అయితే నిలబడడం కష్టం అనే ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి చూద్దాం ఏమవుతుందో.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు