SreeLeela: మాస్ పాత్రలే కావాలంటున్న హీరోయిన్..!

కెరీర్ ఆరంభించిన అనతి కాలంలోనే టాప్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగి స్టార్ హీరోల సరసన వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది యువ హీరోయిన్ శ్రీలీల. ప్రస్తుతం అరడజనుకి పైగా సినిమాలను లైనప్ లో పెట్టిన శ్రీలీల టాలీవుడ్లో మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్ గా ఉంది. సీనియర్ హీరో, యంగ్ హీరో అన్న తేడా లేకుండా అందరికి ఇప్పుడు శ్రీలీల ఫస్ట్ ఆప్షన్ గా మారిందంటే అతిశయోక్తి కాదు. తాజాగా విజయ్, పరశురామ్ ప్రాజెక్ట్ కమిట్ అయిన ఈ కన్నడ భామ తనకు మాస్ మసాలా సినిమాలంటే ఇష్టం అని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. కమర్షియల్ సినిమాల్లో ఉండే మాస్ సీన్స్ చూడటం తనకి ఇష్టం అని, అలాంటి సీన్స్ లో నటించే ఛాన్స్ వస్తే అసలు వదులుకోనని చెప్పుకొచ్చింది.
తాను పని చేసిన ఒక్కో హీరో ఒక స్పెషల్ క్వాలిటీ ఉందని, వారందరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటూ వారి నుండి రోజు ఎదో ఒక కొత్త విషయం నేర్చుకుంటున్న అని వెల్లడించింది. తాను ఇంకా మంచి సినిమాలు చేయాలని, జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే మంచి సినిమాలతో కూడిన హిట్స్ ఉండాలన్నది తన కోరిక అని చెప్పింది శ్రీలీల.
ప్రస్తుతం వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్న శ్రీలీల రష్మిక తర్వాత తక్కువ స్పాన్ లో ఇంతటి క్రేజ్ సాధించిన హీరోయిన్ గా నిలిచింది. అయితే, ఇప్పటివరకు కమర్షియల్ సినిమా హీరోయిన్ పాత్రలకే పరిమితం అయిన ఈ అమ్మడు అడపాదడపా యాక్టింగ్ కి ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేస్తే, త్రిష, నయనతార తరహాలో హీరోయిన్ గా సుదీర్ఘ కాలం కొనసాగే అవకాశం ఉంది.
For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు