NBK latest movie update: బాలకృష్ణ డేట్స్ కోసం వెయిట్ చేస్తున్న ఆ స్టార్ డైరెక్టర్

NBK latest movie update

ఒకప్పుడు పలు సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన స్టార్ డైరెక్టర్ బి. గోపాల్ అంటే తెలియని సినీ ప్రేక్షకులు ఉండరనే చెప్పాలి . చిరంజీవి, బాలకృష్ణ, మోహన్ బాబు, వెంకటేష్ లాంటి సీనియర్ హీరోలతో పలు సూపర్ సినిమాలు తీసి, వాళ్ళ కెరియర్ లోనే గుర్తుండిపోయే చిత్రాలను అందించిన డైరెక్టర్ బి గోపాల్ ప్రస్తుతం సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు.

టాలీవుడ్ లోఇప్పుడంతా యంగ్ డైరెక్టర్ల హావ కొనసాగుతుండటంతో బి గోపాల్ లాంటి సీనియర్ డైరెకర్లు కనుమరుగైపోయారు. హీరోలు కూడా సీనియర్ డైరెక్టర్ల లతో కంటే కూడా కొత్త దర్శకులతోనే సినిమాలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తుండటంతో ఓల్డ్ డైరెక్టర్లు అందరు డైరెక్షన్ కు దూరమై పోయారు. అప్పుడప్పుడు యస్ వి కృష్ణారెడ్డి లాంటి దర్శకులు సినిమాలు చేస్తున్న కూడా ఆ సినిమాలు ప్రేక్షకాదరణ పొందటం లేదు

అయితే లేటెస్ట్ గా డైరెక్టర్ బి. గోపాల్ కూడా మరోసారి డైరెక్షన్ చేయాలనే ప్లానింగ్ లో ఉన్నాడట… ఆయన చివరి సినిమా ఆరడుగుల బుల్లెట్. గోపిచంద్ హీరోగా నటించిన ఈ ఆరడుగుల బుల్లెట్ సినిమా పలు కారణాల వల్ల మధ్యలోనే ఆగిపోయింది. ఇక దాదాపు నాలుగు సంవత్సరాల తరువాత ఈ సినిమా 2021లో థియేటర్స్ రిలీజై, డిజాస్టర్ గా నిలిచింది. దాంతో బి. గోపాల్ అవుట్ డేటెడ్ దర్శకులు లిస్ట్ లో చేరిపోయాడు.

- Advertisement -

అయితే ప్రస్తుతం డైరెక్టర్ బి. గోపాల్, బాలకృష్ణ తో సినిమా చేయాలనీ ప్రయత్నాలు చేస్తున్నాడట. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్ , సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు, పలనాటి బ్రహ్మనాయుడు వంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి.ఈ సెంటిమెంట్ నే కంటిన్యూ చేస్తూ, బాలకృష్ణ తో చివరిగా ఒక సినిమా చేసి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా రిటైర్ అయిపోదామనే ఆలోచనలో ఉన్నాడట. కానీ బాలయ్య చూస్తే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పట్లో ఆయన బి గోపాల్ సినిమాకు ఒకే చేసే పరిస్థితి కనిపించటం లేదు. కానీ బి గోపాల్ మాత్రం బాలకృష్ణ సినిమా చేయాల్సిందే అని గట్టిగ ఫిక్స్ అయ్యి, విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడట. మరీ ఈ సూపర్ హిట్ కాంబినేషన్ మరోసారి సినిమా చేస్తారో లేదో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు