Actress Tamannaah: లస్ట్ బ్యూటీకి దశ తిరిగిపోయింది.. ఇక సేఫ్ సైడ్

Actress Tamannaah

మిల్క్ బ్యూటీ తమన్నా… ఇది ఇప్పుడు కాదు. ఇప్పుడు లస్ట్ బ్యూటీ తమన్నా. తమన్నా కెరీర్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, లస్ట్ స్టోరీస్ 2 ముందు, లస్ట్ స్టోరీస్ తర్వాత అని చెప్పొచ్చు. దాదాపు కెరీర్ ఖతం అయిపోయింది అనుకున్న సమయంలో లస్ట్ స్టోరీస్ 2 వచ్చింది. డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అయినా, తన సత్తా ఏంటో చూపింది తమన్నా. దీని తర్వాత తమన్నాకు కెరీర్ మళ్లీ పుట్టిందని చెప్పొచ్చు.

కెరీర్ ముగిసిపోయింది అనే స్టేజ్ నుంచి సౌత్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోలకు ఫస్ట్ ప్రియారిటీ స్థాయికి వచ్చింది. ఈ వారం థియేటర్ లో తమన్నా హవా కనిపింబోతుంది. సూపర్ స్టార్ రజినీకాంత్ తో నటించిన జైలర్, మెగాస్టార్ చిరంజీవితో నటించిన భోళా శంకర్ సినిమాలు ఈ వారంలో బాక్సాఫీస్ వద్ద తలపడబోతున్నాయి. ఇందులో ఏది విజయం సాధించినా, తమన్నా విజయం సాధించినట్టే.

జైలర్ లో చిన్న పాత్ర కాబట్టి, ఎక్కువ గుర్తింపు రాకపోవచ్చు. కానీ, భోళా శంకర్ లో మెయిన్ లీడ్ కాబట్టి, తమన్నా ఫర్మామెన్స్‌కి మంచి మార్కులే పడతాయని క్రిటిక్స్ అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన సాంగ్స్‌లో తమన్నా డ్యాన్స్ కానీ, లుక్స్ కానీ, ఓ రేంజ్ లో ఉన్నాయి. ఇక యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా. అందుకే తమన్నాకు ఈ వారం సూపర్ గా ఉంటుందని అంటున్నారు ఫ్యాన్స్.

- Advertisement -

దీని తర్వాత కూడా తమన్నా (Tamannaah) కు అవకాశాలు తక్కువేమీ లేవు. మాలీవుడ్‌లో బాంద్రా, కోలీవుడ్‌లో అరన్మయి4, బాలీవుడ్‌లో వేదా సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. బాలయ్య – బాబీ కాంబోలో వచ్చే మూవీలో కూడా హీరోయిన్‌గా తమన్నాను తీసుకోవాలని చర్చలు సాగుతున్నాయి. వీటితో పాటు చాలా మంది దర్శక నిర్మాతలు తమన్నా డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇలా దాదాపు మూడు నుంచి నాలుగేళ్ల పాటు తమన్నా కాల్ షీట్స్ బిజీ బిజీగా ఉండబోతున్నాయి.

మొత్తంగా ఈ లస్ట్ బ్యూటీ తమన్నా కెరీర్ ఎండ్ స్టేజ్ నుంచి బిజియేస్ట్ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం ఈమె చేతిలో ఉన్న సినిమాలు హిట్ అయితే, తమన్నా కెరీర్ మరింత పీక్స్ లో ఉంటుందని చెప్పొచ్చు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Web Stories, Movie Reviews and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు