Tamannaah’s second innings : మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన తమన్నా ?

Tamannaah’s second innings

టాలీవుడ్ మిల్క్ బ్యూటీ తమన్నా కెరీర్ మళ్ళీ గాడిలో పడినట్టు తెలుస్తోంది. గతకొద్ది రోజులుగా సౌత్ సినిమాల్లో అవకాశాలు లేక సతమతమవుతున్న తమన్నా ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్ లలో మోస్ట్ ట్రెండింగ్ హీరోయిన్ అయిపొయింది.

అవును ! కెరీర్ బిగినింగ్ లోనే దాదాపు స్టార్ హీరోలందరితో వర్క్ చేసిన తమన్నాకు ఈ మధ్య సినిమాలు రావడమే కష్టమైంది. దాంతో సౌత్ కు బాయ్ బాయ్ చెప్పి ఇటీవలనే వరుస బాలీవుడ్ ప్రాజెక్ట్ లతో బిజీ అయిపొయింది తమన్నా. సౌత్ సినిమాలు చేస్తున్న సమయంలో ఎలాంటి ఎక్స్ పోజింగ్ లు గట్రా లేకుండా పద్దతిగా సినిమాలు చేస్తూ, స్టార్ హీరోయిన్ గా చెలామణి అయిన తమన్నాకు తెలుగు సినిమాలు చేతిలో లేకపోవడంతో ఇక బాలీవుడ్ లో బోల్డ్ క్యారెక్టర్ లు కూడా చేయడానికి రెడీ అయింది.

అయితే తమన్నా కు ఇక నుంచి ఆ సమస్య తీరిపోయినట్టు తెలుస్తోంది. ఎందుకంటే తమన్నా ప్రస్తుతం చేస్తున్న జైలర్, భోళా శంకర్ సినిమాలు రిలీజ్ కు రెడీ అయ్యాయి. మొన్నటిదాక సినిమాలు రావడమే కష్టమైన తమన్నాకు రెండు పెద్ద సినిమాలు ఒకేసారి ఒకే నెలలో, ఒక రోజు తేడాతో రిలీజ్ అవబోతుండటం విశేషం.

- Advertisement -

ఒక పక్క టాలీవుడ్ మెగా స్టార్ సినిమా, మరొపక్క కోలీవుడ్ సూపర్ స్టార్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద తలపడబోతుండటంతో ఆగస్ట్ నెల ఇంట్రెస్టింగ్ గా మారింది. అయితే ఈ రెండు సినిమాల్లో తమన్నానే హీరోయిన్ గా చేస్తుండటంతో ఈ సినిమాల్లో ఏది మంచి హిట్టైన తమన్నా కెరీర్ మళ్ళీ ఊపందుకోవడం ఖాయమని తెలుస్తోంది.

కాగా జైలర్, భోళా శంకర్ సినిమాలకు ప్రేక్షకుల్లో మంచి బజ్ ఉండటం మూలాన ఈ రెండు సినిమాలు సక్సెస్ అయ్యేలాగానే కనిపిస్తున్నాయి . ఒకవేళ అందరు అనుకుంటున్నట్టే జైలర్, భోళా శంకర్ రెండు సినిమాలు హిట్టయితే హీరోల పరిస్థితీ ఏమోగానీ తమన్నాకు మాత్రం సెకండ్ ఇన్నింగ్స్ కు బిగ్గెస్ట్ స్టార్ట్ అవుతుందని చెప్పవచ్చు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు