Megastar compliments Vaishnavi: బేబీ హీరోయిన్ కి మెగా కాంప్లిమెంట్ – ఇక తిరుగులేదు..!

Megastar compliments Vaishnavi

సాయి రాజేష్ డైరెక్షన్లో ఆనంద్ దేవరకొండ హీరోగా, యూట్యూబ్ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా రూపొందిన బేబీ సినిమా ఇటీవలే రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా యూనిట్ ని అభినందిస్తూ మెగాస్టార్ చిరంజీవి అప్రిసియేషన్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ లో సినిమా యూనిట్ అందరిని పేరుపేరునా ప్రశంసించిన మెగాస్టార్, హీరోయిన్ వైష్ణవి చైతన్యను ఆకాశానికి ఎత్తేశాడు. ఈ సినిమాలో రెండు డిఫరెంట్ షేడ్స్ లో వైష్ణవి చాలా చక్కగా నటించిందని కితాబిచ్చిన చిరు వైష్ణవిని సహజనటి జయసుధతో పోల్చాడు. జయసుధ తర్వాత అంత సహజంగా నటించే హీరొయిన్ కనిపించలేదని, ఇన్నాళ్లకు వైష్ణవి జయసుధని తలపించిందని అన్నాడు.

మెగాస్టార్ కాంప్లిమెంట్ కి వైష్ణవి సహా సినిమా యూనిట్ తో పాటు ఆడియెన్స్ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా మొదటి సినిమాతోనే మెగాస్టార్ నుండి ఆ రేంజ్ కాంప్లిమెంట్ అందుకోవటం వైష్ణవి అదృష్టం అని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ క్రమంలో తన అభిమానులైన నిర్మాత ఎస్ కే ఎన్, డైరెక్టర్ సాయి రాజేష్ ఇంతటి సక్సెస్ అందుకోవటం తనకి గర్వంగా ఉందని అన్నాడు మెగాస్టార్.

మొదటి నుండి పాజిటివ్ వైబ్స్ సొంతం చేసుకున్న బేబీ సినిమా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ సొంతం చేసుకొని ఇప్పటికే 70కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి దూసుకుపోతుంది. ఇటీవలే ఈ సినిమాలో ఇంకొన్ని సీన్స్ యాడ్ చేయనున్నట్లు సినిమా యూనిట్ అనౌన్స్ చేయటంతో సినిమాపై యూత్ లో మళ్లీ ఆసక్తి పెరుగుతోంది. మరి, సీన్స్ యాడ్ చేశాక రిపీట్ ఆడియెన్స్ పెరిగి బేబీ 100కోట్ల మైల్ స్టోన్ అందుకుంటుందేమో వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు