Faria Abdullah Comments: బాలీవుడ్ స్టార్ హీరోతో పోల్చుకుంటున్న చిట్టి

Faria Abdullah Comments

చిట్టి… ఈ పేరును ప్రతి ఇంట్లో వాడుతారు. కానీ, జాతి రత్నాలు సినిమా వచ్చిన తర్వాత చిట్టి పేరును రొమాంటిక్‌గా వేవ్‌లో పిలుస్తున్నారు. యూత్ తమ గర్ల్ ఫ్రెండ్స్2ని చిట్టి అనే అంటున్నారు. జాతిరత్నాలు సినిమా వచ్చి రెండేళ్లు గడిచిపోతున్నా, ఈ పేరు హవా ఏ మాత్రం తగ్గలేదు. ఫరియా అబ్దుల్లాను ఇప్పటికీ కూడా చిట్టి అనే పిలుస్తున్నారు.

అంతలా క్రేజ్ తెచ్చుకున్న ఫరియా అబ్దుల్లాకి అవకాశాలు మాత్రం ఎక్కువ రావడం లేదు. జాతి రత్నాలు తర్వాత కొన్ని చిన్న సినిమాలు చేసింది. అయినా, తగిన గుర్తింపు రాలేదు. దీంతో ఓటీటీ రంగ ప్రవేశం చేయడానికి రెడీ అయిపోయింది చిట్టి. సినిమాలతో పని అయ్యేలా లేదని, వెబ్ సిరీస్‌లు చేసి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తోంది.

అందులో భాగంగా తన కెరీర్ లో ఫస్ట్ వెబ్ సిరీస్‌కి ఇటీవల సైన్ చేసింది. అదే.. “ది జెంగాబూరు కర్స్”. ఈ వెబ్ సిరీస్ సోనీ లివ్ లో ఈ నెల 9 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో వరుసగా ప్రమోషన్స్‌లో పాల్గొంటుంది ఫరియా అబ్దుల్లా. ఇటీవల ప్రమోషన్స్‌లో భాగంగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో చిట్టి తనను తాను ఓ బాలవుడ్ సూపర్ స్టార్‌తో పోల్చుకుంది. అతను ఎవరో కాదు… బాలీవుడ్ స్టైలీష్ హీరో రణవీర్ సింగ్.

- Advertisement -

తాను రణవీర్ సింగ్‌కు ఫిమేల్ వెర్షన్ అని, ఆయన అంటే తనకు చాలా ఇష్టం అంటూ చెప్పుకొచ్చింది. రణవీర్ సింగ్ విషయంలో కొన్ని సార్లు దీపిక పదుకొనె కంటే, తానే ఎక్కువ రిలేట్ అవుతానని కూడా చెప్పింది చిట్టి. దీంతో నెటిజన్ల నుంచి భిన్న స్సందన వస్తోంది. రణవీర్ విషయంలో బాలీవుడ్ పొడుగు కాళ్ల సుందరికి, టాలీవుడ్ పొడుగు కాళ్ల సుందరి పోటీ వస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు