Bhola Shankar: టాలీవుడ్ లో హైయెస్ట్ ఎవర్ కటౌట్ గా భోళా శంకర్ మాస్!

HIGHEST EVER CUTOUT OF TOLLYWOOD

ఇండియన్ సినిమాల్లో ఏ బడా హీరో సినిమా రిలీజ్ అయినా ఆ హీరోకి బ్యానర్ లు కట్టడం, పూల మాలలు వేయడం, బ్యాండ్ సౌండ్స్ తో హంగామా చేయడం తెలిసిందే. అయితే వీటన్నిటికీ మించి చేసే సెలబ్రేషన్ మరొకటి ఉంది. అదే హీరో “కటౌట్”. టాలీవుడ్ లో తమ హీరోల క్రేజ్ చెప్పడానికి ఫ్యాన్స్ చేసే సెలెబ్రేషన్స్ లో ఇది కూడా ఒక భాగం. ఒకప్పుడు చాలా థియేటర్లలో ఈ కటౌట్ లు పెట్టేవారు. కానీ అనుకోకుండా ఆ కటౌట్ లు కట్టడం లో జరుగుతున్న పలు ప్రమాదాల వల్ల అన్ని ఏరియాల్లో ఈ కటౌట్స్ కట్టడానికి పర్మిషన్స్ ఇవ్వట్లేదు.

ఇక తాజాగా టాలీవుడ్ లో ఈ కటౌట్స్ లో కొత్త రికార్డు సెట్ అయ్యింది. ఆగష్టు 11న “భోళా శంకర్” రిలీజ్ అవుతున్న సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ ఒక అరుదైన రికార్డుని సెట్ చేసారు. టాలీవుడ్ లో హైయెస్ట్ ఫీట్స్ ఉన్న కటౌట్ ని మెగాస్టార్ చిరంజీవి పేరిట ఏర్పాటు చేసారు మెగాభిమానులు. ఆ కటౌట్ సూర్యపేటలో రాజుగారితోట వద్ద కట్టడం జరిగింది. ఇక టాలీవుడ్ లో ఇప్పటివరకు టాలీవుడ్ లో 100 అడుగుల వరకు అందరి హీరోల కటౌట్స్ పెట్టడం జరిగింది.

- Advertisement -

వీటిలో అతిపెద్ద కటౌట్ మహేష్ బాబు ఆగడు సినిమాకి 112 అడుగుల కటౌట్ చేసారు. ఇక దాన్ని బ్రేక్ చేస్తూ భోళా శంకర్ పేరిట 126 అడుగుల భారీ కటౌట్ ని ఏర్పాటు చేసారు ఫ్యాన్స్. ఇప్పుడు టాలీవుడ్ లో హైయెస్ట్ ఫీట్స్ ఉన్న కటౌట్ గా మేకర్స్ అనౌన్స్ చేసారు. ఇక భోళా శంకర్ సినిమా ఆగష్టు 11న రిలీజ్ కి రెడీ అవుతుంది.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు