Baby movie sensation : బేబీ రీమేక్ కు భారీ డిమాండ్

Baby movie sensation

బేబీ సినిమా క్రేజ్ రోజు, రోజుకు పెరుగుతూ పోతుంది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రం జులై 14న థియేటర్స్ లో రిలీజై, సంచలన విజయాన్ని అందుకుంటుంది. ఇప్పటికే దాదాపు 70 కోట్లకు పైగా కలెక్షన్స్ ను కొల్లగొట్టిన ఈ సినిమా థియేటర్స్ లో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది.

సాయి రాజేష్ దర్శకత్వంలో తెరెకెక్కిన ఈ సినిమాను మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్ కే ఎన్ నిర్మిచారు. యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా రూపొందించబడిన ఈ చిత్రం మీడియం రేంజ్ బడ్జెట్ సినిమాగా నిర్మించబడి, కలెక్షన్స్ లో మాత్రం పెద్ద సినిమాను తలపిస్తోంది. అయితే ఒక పక్క కలెక్షన్స్ లో దూసుకుపోతూనే పలువురు సినీ ప్రముఖుల నుంచి, విమర్శకుల నుంచి ప్రశంషలు కూడా అందుకుంటుంది.

అయితే ఈ ప్రశంషలు కేవలం టాలీవుడ్ నుంచే కాదు బయట ఇండస్ట్రీ ల నుంచి కూడా వస్తున్నాయి. దాంతో తమిళ్ మరియు హిందీలో ఈ సినిమాను రీమేక్ చేయడానికి చర్చలు జరుగుతున్నాయట. నిర్మాతకు ఎస్ కే ఎన్ కు ఇప్పటికే చాలా మంది ఫోన్ లు చేస్తూ రీమేక్ రైట్స్ గురించి అడుగుతున్నారట. అయితే బేబీ థియేటర్స్ రన్ ఇంకా పూర్తిగా కంప్లిట్ అవకపోవడంతో రీమేక్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదట. అయితే పలువురు బేబీ రీమేక్ రైట్స్ కోసం పెద్ద మొత్తంలో అమౌంట్ కూడా ఇస్తామని ఆఫర్ చేస్తుండటంతో ఎస్ కే ఎన్ నే స్యయంగా హిందీ, తమిళ్ లో సినిమాను తీయాలనే ప్లానింగ్ లో ఉన్నట్టు ఫిలిం నగర్ టాక్ వినిపిస్తోంది. ఇక బేబీ సినిమాను ఇటీవలనే చూసిన మెగాస్టార్ చిరంజీవి బేబీ టీం ను అప్రిషియేట్ చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు