Tollywood: “బ్రో” లెక్క.. పవర్ స్టార్ క్రేజ్ కి పరాకాష్ట!

“Bro” Movie First Day Collections

టాలీవుడ్ లో హైయెస్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో ఆ తరం ఎన్టీ రామారావు, ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటారు ఇండస్ట్రీ వర్గాల్లో. వీరి సినిమాలు ఎప్పుడు వచ్చినా టాక్ తో సంబంధం లేకుండా ఓపెనింగ్స్ అదరగొడతాయి. ప్రత్యర్ధులు ఎంత నెగిటివిటీ చేసినా, వీరి ఫ్యాన్ బేస్ బలం ముందు చిన్నబోతుంది. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన “బ్రో” సినిమా జులై28 న రిలీజ్ అయి మిశ్రమ స్పందన తెచ్చుకున్న విషయం తెలిసిందే.

అయితే ఈ సినిమా రిలీజ్ కి ముందు బ్రో పై సినిమా పరంగా, రాజకీయపరంగా ఎన్నో అడ్డంకులు ఎదురైన సంగతి తెలిసిందే. బ్రో సినిమా ఒక రీమేక్ అని, రొటీన్ సినిమా తీస్తున్నారని, పాటలు బాగాలేవని ఇలా రకరకాల ట్రోలింగ్స్ చేసారు. ఇవేగాక రాజకీయంగా పవన్ కళ్యాణ్ కి గతంలోనూ వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలు రిలీజ్ టైమ్ లో అడ్డుకోడానికి ఎంత ట్రై చేసారో తెలిసిందే.

ఈ సినిమాకి అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్మాతలు ముందు జాగ్రత్త తీసుకున్నారు. “బ్రో” సినిమాని తక్కువ రేట్లకే డిస్ట్రిబ్యూటర్లకు విక్రయించగా, టికెట్ హైక్ కూడా పెంచకుండా సాధారణ రేట్లకే నిర్ణయించడం జరిగింది. అదీ గాక బెనిఫిట్ షో లు కూడా వెయ్యలేదు. ఇన్ని రకాల సమస్యల నడుమ రిలీజ్ అయిన బ్రో డీసెంట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ భారీ ఓపెనింగ్స్ తో కుమ్మేసింది. మార్నింగ్ షో లలో అక్కడక్కడా కొంచెం లిమిటెడ్ ఫుల్స్ అయినా, ఈవెనింగ్ షోస్ వచ్చేసరికి టికెట్ ముక్క మిగల్లేదు.

- Advertisement -

ఇక ఫస్ట్ డే బ్రో తెలుగు రాష్ట్రాల్లో 23.61 కోట్ల షేర్, అలాగే, కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 2.10కోట్ల షేర్, ఓవర్సీస్ లో 4.30 కోట్ల షేర్, ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా 30.01కోట్ల షేర్, 48.50కోట్ల గ్రాస్ ని రాబట్టింది. బ్రో సినిమాకి పవన్ కళ్యాణ్ గత సినిమాల కన్నా కొంచెం తక్కువ ఓపెనింగ్సే వచ్చినప్పటికీ, ఇన్ని రకాల ఇబ్బందుల్లోను ఈ రేంజ్ ఓపెనింగ్స్ అంటే అది ఓన్లీ పవన్ కళ్యాణ్ సినిమా కాబట్టే ఈ క్రేజ్ అని చెప్పవచ్చు. ఇక బ్రో రిలీజ్ తర్వాత కూడా వైసిపి వర్గ నేతలు సినిమాలో ప్రముఖ రాజకీయ నేతని అవమానించారని కామెంట్స్ చేస్తున్నారు.

అయితే బ్రో సినిమా ఫస్ట్ డే తో సంబంధం లేకుండా రెండో రోజు మరింత జోరు చూపిస్తుందని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు