Record-breaking viewership : ఓటిటిలోను సామజవరగమన సంచలనం

Record-breaking viewership for SAMAJAVARAGAMANA

గడిచిన ఏడాది సగంలో వచ్చిన సర్ప్రైజింగ్ సూపర్ హిట్ సినిమా అంటే సామజవరగమన సినిమా అనే చెప్పాలి. అసలేమాత్రం అంచనాలు లేకుండా, చిన్న సినిమాగా రిలీజైన సామజవరగమన థియేటర్స్ లో సంచలన విజయాన్ని సాధించింది. జూన్ 29 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకోవడంతో బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

శ్రీ విష్ణు, రెబ మోనికా జాన్, సీనియర్ నరేష్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా థియేటర్స్ లో ప్రదర్షింపబడుతుండగానే ఇటీవలనే ఆహా లో స్ట్రీమింగ్ లోకి వచ్చింది. అయితే ఇంతటి ఘన విజయాన్ని ఎక్స్ పెక్ట్ చేయని మూవీ టీం ముందుగా కుదుర్చుకున్న అగ్రిమెంట్ మేరకు ఆహాలో స్ట్రీమ్ అవడానికి ఒప్పుకున్నారు. జులై 28 నుంచి సామజవరగమన స్ట్రీమింగ్ అవ్వాల్సి ఉండగా ప్రేక్షకుల కోరిక మేరకు ఒక రోజు ముందుగానే స్ట్రీమింగ్ లోకి వచ్చింది.

స్టార్ హీరోల సినిమాల కలెక్షన్స్ ను తలపించేలా బాక్స్ ఆఫీస్ వద్ద 50 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టిన ఈ సినిమా ఓటిటిలో కూడా రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. సామజవరగమన సినిమా ఆహాలో అప్లోడ్ చేసిన 40 గంటల్లోనే 100 మిలియన్లకు పైగా వ్యూవర్ షిప్ ను సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు ఆహాలో ఉన్న సినిమాలలో ఫాస్టెస్ట్ 100 మిలియన్ కేవలం నలభై గంటలలో సాధించిన రికార్డ్ సామజవరగమనకే సాధ్యమైందంటూ ఆహా టీం పోస్టర్ రిలీజ్ చేసి ప్రేక్షకులకు థాంక్స్ చెప్పింది. దీనిబట్టి చూస్తే సామజవరగమన సౌండ్ ఓటిటిలోనుగట్టిగానే వినిపిస్తునట్టు తెలుస్తుంది.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు