Guntur Kaaram latest rumour : గుంటూరు కారం సినిమా పై వస్తోన్న ఆ రూమర్ కు మహేష్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ

Guntur Kaaram latest rumour

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ సినిమా గుంటూరు కారం పై వస్తోన్నఒక లేటెస్ట్ రూమర్ కు మహేష్ బాబు అభిమానులు తెగ హ్యాపీగా ఫీల్ అవుతున్నారనే టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఆ రూమర్ నిజం అవ్వాలని కూడా గట్టిగ కోరుకుంటున్నరట..ఇంతకు ఆ రూమర్ ఏంటా అని అనుకుంటున్నారా..!

మ్యాటర్ ఏంటంటే ఇప్పటి వరకు మహేష్ బాబు 27 సినిమాలు చేసాడు. 28వ సినిమాగా గుంటూరు కారం సినిమా చేస్తున్నాడు. అయితే ఇప్పటి వరకు మహేష్ చేసిన అన్నీ సినిమాల్లో కెల్లా గుంటూరు కారం సినిమా వివాదాస్పదమైనట్టుగా మరేతర సినిమా అవ్వలేదు. ఏదో ఒక న్యూస్ తో నిత్యం గుంటూరు కారం సినిమా వార్తల్లో నిలుస్తూ వస్తున్న విషయం అందరికి తెలిసిందే. అయితే గతకొద్ది రోజులుగా గుంటూరు కారం సినిమాపై వచ్చే రూమర్స్ కు అన్నింటికి ఫ్రాస్టేట్ అవుతున్న మహేష్ ఫ్యాన్స్, ఒక రూమర్ విషయంలో మాత్రం చాలా హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు. అదేంటంటే గుంటూరు కారం సినిమా ఫస్ట్ సింగిల్ రూమర్.

అవును ! ఇటీవలనే సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టిన రోజు సందర్భంగా గుంటూరు కారం సినిమా గ్లిమ్స్ వీడియో రిలిజ్ చేయగా, ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. అయితే లెటెస్ట్ గా మహేష్ బాబు పుట్టిన రోజు ఆగస్ట్ 9న వస్తుండటంతో గుంటూరు కారం సినిమాలోని మొదటి పాటను రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు ఒక రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పటి వరకు గుంటూరు కారం సినిమాపై వస్తోన్న రూమర్స్ కు నిరాశ చెందుతున్నఫ్యాన్స్, గుంటూరు కారం సినిమాలోని మొదటి పాట మహేష్ పుట్టిన రోజున రాబోతుందనే రూమర్ కు మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మరీ ఈ రూమర్ ను కన్సిడర్ చేస్తూ మేకర్స్ సినిమాలోని మొదటి పాటను రిలీజ్, చేస్తారా, చేయరా అనేది ప్రశ్నార్ధకం !

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు