NBK109: డైరెక్టర్ మారినా ఫార్మాట్ మార్చని బాలయ్య..!

సినిమాల్లో ఏదైనా ఒక ఫార్ములా కానీ, సెంటిమెంట్ కానీ వర్కౌట్ అయితే ఇక అదే సెంటిమెంట్ ని చాలా కాలం రిపీట్ చేస్తుంటారు. ఇది చాలాసార్లు వర్కౌట్ అయినప్పటికీ అప్పుడప్పుడు ఫెయిల్ అవుతూ ఉంటుంది. ముఖ్యంగా సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ గత కొన్ని సంవత్సరాలుగా ఒకే ఫార్మాట్ లో సినిమాలు చేస్తూ వస్తున్నాడు. బోయపాటి డైరెక్షన్లో వచ్చిన సింహా సినిమాతో మొదలైన ఈ ఫార్మాట్ ని ప్రతి సినిమాలో ఫాలో అవుతూ వస్తున్నాడు. బాలయ్య అంతగా ఫాలో అవుతున్న ఫార్మాట్ ఏంటంటే ఓల్డ్ గెటప్, యంగ్ గెటప్ లో డ్యూయల్ రోల్ లో కనిపించడం. ఈ ఏడాది రిలీజ్ అయిన వీరసింహారెడ్డి సినిమాలో డ్యూయల్ రోల్ లో కనిపించి హిట్ అందుకున్న బాలయ్య, బాబీ డైరెక్షన్లో చేయబోయే సినిమాకు కూడా అదే ఫార్మాట్ ని ఫాలో అవుతున్నట్లు సమాచారం.

ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్లో భగవంత్ కేసరి సినిమాలో నటిస్తున్న బాలకృష్ణ ఈ సినిమా పూర్తయ్యాక బాబీ సినిమా స్టార్ట్ చేసే ప్లాన్ లో ఉన్నాడు. ఇటీవల రిలీజ్ అయిన టైటిల్ గ్లిమ్ప్స్ లో తెలంగాణ యాసతో బాలయ్య చెప్పిన డైలాగ్ ఆకట్టుకోగా సినిమాపై అంచనాలు పెరిగాయి. బాలకృష్ణ సరసన కాజల్ అగర్వాల్ శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 20న రిలీజ్ కి సిద్ధమవుతోంది.

ఎంటర్టైన్మెంట్ సినిమాలకు కేరాఫ్ అయిన అనిల్ రావిపూడి కూడా బాలయ్య మార్క్ మాస్ మసాలా కథకి షిఫ్ట్ అవడం ఆసక్తి కలిగిస్తోంది. ఇక బాబీ సినిమాలో బాలయ్య  70ఏళ్ల వయసు పాత్రలో కాసేపు కనిపిస్తారని టాక్ వినిపిస్తోంది. దీంతో డైరెక్టర్ మారినా కూడా బాలకృష్ణ మాత్రం ఒకే ఫార్మాట్ లో సినిమా చేస్తున్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. మరి, వాల్తేరు వీరయ్య సినిమాలో వింటేజ్ చిరంజీవిని చూపించి సక్సెస్ అయిన బాబీ బాలకృష్ణను ఏ రకంగా చూపిస్తాడో వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు