Samantha: అప్పుడు ఆలా – ఇప్పుడు ఇలా, మళ్ళీ సింపతీ కోసమేనా..?

లేడి సూపర్ స్టార్ సమంత ఏం చేసినా అది సెన్సేషన్ అవుతోంది ఈ మధ్య. సమంత ఇంస్టాగ్రామ్ లో ఏదైనా ఫోటో కానీ, పోస్ట్ కానీ షేర్ చేయగానే ఇట్టే వైరల్ అవుతోంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి సినిమాలో నటిస్తున్న సమంత టర్కీలో షూట్ గ్యాప్ మధ్యలో విజయ్ తో కలిసి రెస్టారెంట్ లో చిల్ అవుతున్న ఫోటోలు, సిటాడెల్ షూటింగ్ తర్వాత వరుణ్ ధావన్ తో కలిసి పబ్ లో డాన్స్ చేస్తున్న వీడియో ఎంత వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ సమయంలో కొంతమంది నెటిజన్లు, అక్కినేని ఫ్యాన్స్ సమంతపై నెగిటివ్ కామెంట్స్ తో విరుచుకుపడ్డారు. ఇండియాలో ఉన్నప్పుడు శాకుంతలం సినిమా ప్రమోషన్స్ సమయంలో అనారోగ్యం గురించి చెప్తూ సింపతీ కోసం డ్రామా ఆడిందని, సినిమా ఫ్లాప్ అవగానే ఫారిన్ వెళ్లి హ్యాపీగా చిల్ అవుతోందని కామెంట్ చేశారు.

తాజాగా సమంత పోస్ట్ చేసిన ఎమోషనల్ కోట్ గురించి కూడా అదే రేంజ్ లో నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ‘చావు నుండి ఏది మనల్ని కాపాడలేనప్పుడు కనీసం ప్రేమ అయినా కాపాడుతుంది అంటూ సమంత చేసిన ఎమోషనల్ కోట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. సమంత అభిమానులు ఆ పోస్ట్ కి పాజిటివ్ గా స్పందిస్తుండగా అక్కినేని ఫ్యాన్స్ మాత్రం మళ్ళీ సింపతీ గేమ్ స్టార్ట్ చేసిందంటూ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

నాగచైతన్యతో విడాకుల తీసుకున్న నాటి నుండి సమంత మీద మొదలైన అక్కినేని అభిమానుల నెగిటివ్ కామెంట్ల దాడి ఇప్పట్లోనే ఆగేలా లేదు చూస్తుంటే. శాకుంతలం సినిమా డిజాస్టర్ అవటంతో ఈ దాడి మరింత పెరిగిందని చెప్పాలి. అయితే, ఎప్పటికప్పుడు విమర్శలకు తనదైన శైలిలో సమాధానం ఇస్తూ వరుస సినిమాలతో దూసుకెళ్తున్న సమంత ఖుషి సినిమా ద్వారా అయినా బ్లాక్ బస్టర్ అందుకుంటుందో లేదో వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు