Raviteja: హిట్ కాంబినేషన్లో మరో సినిమా..!

మాస్ మహారాజ రవితేజ, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన మిరపకాయ్ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యి హరీష్ శంకర్ కి స్టార్ డైరెక్టర్ స్టేటస్ ని తెచ్చి పెట్టింది. ఈ క్రేజీ కాంబినేషన్లో మరో సినిమా రాబోతుందంటూ చాలా కాలంగా వార్తలొస్తున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆ వార్తలు నిజమే అని త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రాబోతుందని తెలుస్తోంది. ఇటీవల రావణాసుర సినిమాతో డిజాస్టర్ అందుకున్న రవితేజ ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు, ఈగల్ సినిమాలను లైన్లో పెట్టాడు. ఈ నెలలోనే హరీష్ శంకర్ సినిమా ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

హరీష్ శంకర్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇద్దరి కమిట్మెంట్స్ పూర్తయ్యాక ఈ క్రేజీ కాంబోలో సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. అయితే, రవితేజ ఇప్పటికే త్రినాథరావు నక్కిన, అనుదీప్ లతో సినిమాలు కమిట్ అయ్యాడని వార్తలొస్తున్న నేపథ్యంలో హరీష్ శంకర్ తో సినిమా ఎప్పుడన్నది క్లారిటీ రావాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేదాకా ఆగాల్సిందే.

మొదటి సినిమా షాక్ తో డిజాస్టర్ ఇచ్చిన హరీష్ కి మరో ఛాన్స్ ఇచ్చి మిరపకాయ్ లాంటి బ్లాక్ బస్టర్ ని అందించాడు. మళ్ళీ ఇప్పుడు ఈ కాంబినేషన్లో మరో సినిమా అనగానే సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. అయితే, ప్రస్తుతం టైగర్ నాగేశ్వరావు, ఈగల్ వంటి సీరియస్ సినిమాలను లైన్లో పెట్టిన రవితేజ హరీష్ తో ఎంటర్టైనర్ సినిమా తీస్తాడా లేక సీరియస్ కథతోనే వస్తాడా అన్నది వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు