Godzilla X Kong2 : అక్షరాలా 4660 కోట్ల వసూళ్లు.. అనుకున్నట్టే ఇండియాలో వంద కోట్లు..

Godzilla X Kong2 : టాలీవుడ్ లో ఈ మధ్య తెలుగు సినిమాలు అంతగా ఆడడం లేదన్న విషయం తెలిసిందే. ఎన్నికల హడావిడి కావచ్చు, లేదా ఐపీఎల్ వల్ల కావచ్చు, కారణాలు ఏవైనా టాలీవుడ్ లో దాదాపు నెలలుగా సరైన సినిమా లేదు. కానీ ఈ క్రమంలో ఇతర భాషల సినిమాలు మాత్రం అదరగొట్టేస్తున్నాయి. ఒక్క ఇండియన్ మూవీస్ మాత్రమే కాదు, హాలీవుడ్ సినిమాలు కూడా బాగా ఆడుతున్నాయి. అయితే మన సినిమాల్లా అక్కడ కమర్షియల్ ఎమోషనల్ డ్రామాలకు ఎక్కువ కలెక్షన్లు రావు. వీటికంటే యాక్షన్ అడ్వెంచర్ మూవీస్ కి పెద్ద పీట వేస్తారు అక్కడి ప్రేక్షకులు. ఇక హాలీవుడ్ లో కింగ్ కాంగ్ నేపథ్యంలో వచ్చిన సినిమాలకు మంచి గిరాకీ ఉంటుంది. దాదాపు 50 ఏళ్ళకి ముందు నుండే గొరిల్లా కింగ్ కాంగ్ బ్యాక్ డ్రాప్స్ లో ఆయా కాలాలకు చెందిన టెక్నాలజీకి తగ్గట్టుగా సినిమాలు వస్తూ ఉంటాయి. ఇక లాస్ట్ టైం లాక్ డౌన్ లో ఓటిటి లో నేరుగా గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ సినిమా రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పుడు దీనికి రెండో పార్ట్ గా “గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ ది న్యూ ఎంపైర్” (Godzilla x Kong: The New Empire) మూవీ మార్చి 29న థియేటర్లలోకి వచ్చింది. ఇక ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ భారీ కలెక్షన్లు వసూలు చేసి ట్రేడ్ విశ్లేషకులకి ఆశ్చర్యాన్ని కలిగించింది.

అక్షరాలా 4667 కోట్లు..

ఇక గాడ్జిల్లా X కాంగ్2 (Godzilla x Kong2) సమ్మర్ లో గ్రాండ్ గా రిలీజ్ అవ్వగా, మరీ మొదటి పార్ట్ రేంజ్ లో లేక పోయినా కూడా ఉన్నంతలో బాగానే ఉంది అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా,
ఈ సినిమా సాలిడ్ లాంగ్ రన్ ను కూడా సొంతం చేసుకుంది. ఇక ఇండియా లో సైతం మొదటి పార్ట్ కి మించి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ వసూలు చేసింది. మొత్తం మీద వరల్డ్ వైడ్ రన్ ఆల్ మోస్ట్ ఎండ్ స్టేజ్ కి వచ్చేసిన ఈ సినిమా అమెరికాలో ఓవరాల్ గా, 192 మిలియన్ డాలర్స్ దాకా వసూళ్ళని సొంతం చేసుకోగా, ఇండియన్ కరెన్సీలో ఆల్ మోస్ట్ 1603 వేల కోట్ల దాకా గ్రాస్ ను అందుకుంది. ఇక టోటల్ ఓవర్సీస్ లో సినిమా 367 మిలియన్ డాలర్స్ దాకా వసూళ్ళని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపగా ఇండియన్ కరెన్సీలో చెప్పాలి అంటే ఆల్ మోస్ట్ 3064 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది. వరల్డ్ వైడ్ గా టోటల్ గా ఈ సినిమా 559 మిలియన్ డాలర్స్ మార్క్ ని సొంతం చేసుకోగా, ఇండియన్ కరెన్సీలో చెప్పాలి అంటే ఆల్ మోస్ట్ 4667 వేల కోట్ల దాకా గ్రాస్ ను అందుకుంది.

Godzilla X Kong2 Movie Total collections

- Advertisement -

ఇండియా లో వంద కొట్టిన గాడ్జిల్లా..

ఇక గాడ్జిల్లా కాంగ్ సినిమా ఇండియా లో మన సినిమాలకు ధీటుగా మల్టి ప్లెక్స్ లో హౌస్ ఫుల్ కలెక్షన్లను సాధించగా, ఇండియా లో ఏకంగా వంద కోట్ల క్లబ్ లో చేరింది. ఇక్కడ ఇప్పటి వరకు ఆల్ మోస్ట్ 110 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. ఇక 133 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను ఇక్కడ సాధించి సమ్మర్ లో హాలీవుడ్ మూవీస్ పరంగా ఇండియాలో మంచి విజయాన్ని అందుకున్న మూవీగా నిలిచింది గాడ్జిల్లా X కాంగ్2. ఇక త్వరలో రిలీజ్ కానున్న డెడ్ పోల్ 3 సీక్వెల్ ఇండియాలో మరిన్నీ భారీ కలెక్షన్లు రాబట్టే ఛాన్స్ ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు