Godzilla x Kong The New Empire : ఇండియా లో సెంచరీ కొట్టేసిన సీక్వెల్ బొమ్మ!

Godzilla x Kong The New Empire : హాలీవుడ్ లో ఈ ఇయర్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన సినిమాల్లో ఎక్కువగా అడ్వెంచర్స్ సినిమాలే ఎక్కువగా సక్సెస్ అవుతున్నాయన్న సంగతి తెలిసిందే. మన సినిమాల్లా అక్కడ కమర్షియల్ ఎమోషనల్ డ్రామాలు ఎక్కువ కలెక్షన్లు రావు. వీటికంటే యాక్షన్ అడ్వెంచర్ మూవీస్ కి పెద్ద పీట వేస్తారు అక్కడి ప్రేక్షకులు. ఇక హాలీవుడ్ లో కింగ్ కాంగ్ నేపథ్యంలో వచ్చిన సినిమాలకు మంచి గిరాకీ ఉంటుంది. దాదాపు 50 ఏళ్ళకి ముందు నుండే గొరిల్లా కింగ్ కాంగ్ బ్యాక్ డ్రాప్స్ లో ఆయా కాలానికి చెందిన టెక్నాలజీకి తగ్గట్టుగా సినిమాలు వస్తూ ఉంటాయి. ఇక లాస్ట్ టైం లాక్ డౌన్ లో ఓటిటి లో నేరుగా గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ సినిమా రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పుడు దీనికి రెండో పార్ట్ గా గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ ది న్యూ ఎంపైర్ (Godzilla x Kong: The New Empire) మూవీ మార్చి 29న థియేటర్లలోకి వచ్చింది. ఇక ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ భారీ కలెక్షన్లు వసూలు చేస్తూ ట్రేడ్ విశ్లేషకులకి ఆశ్చర్యాన్ని కల్గిస్తుంది.

ఇండియాలోనే వంద కోట్లు..

ఇక ఈ ఇయర్ హాలీవుడ్ నుండి వచ్చిన మూవీస్ లో మంచి బజ్ ను సొంతం చేసుకుని రిలీజ్ అయిన మూవీ గాడ్జిల్లా X కాంగ్2 సినిమా, మొదటి పార్ట్ సక్సెస్ వలన పార్ట్ 2 పై అంచనాలు ఓ రేంజ్ లో పెరగగా, రెండో పార్ట్ మరీ ఫస్ట్ పార్ట్ రేంజ్ లో రచ్చ చేయక పోయినా కూడా, ఓవరాల్ గా ఒకసారి చూసేలా ఉండటంతో బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ రచ్చ చేస్తూ దూసుకు పోతుంది. ఇండియా లో కూడా ఈ సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపి రీసెంట్ గా 82.5 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకోగా, ఇండియా లో 106 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుంది. ఇక గాడ్జిల్లా మూవీస్ లో ఇలా ఫస్ట్ టైం 100 కోట్ల గ్రాస్ ను అందుకున్న సినిమాగా గాడ్జిల్లా X కాంగ్2 సినిమా సంచలనం సృష్టించింది.

మూడు వేల కోట్లతో రచ్చ..

ఇక గాడ్జిల్లా కాంగ్ 2 సినిమా వరల్డ్ వైడ్ గా ఇప్పటి వరకు 375 మిలియన్ డాలర్స్ మార్క్ ని అందుకుని రచ్చ లేపగా ఇండియన్ కరెన్సీలో ఓవరాల్ గా సినిమా 3110 వేల కోట్లకు పైగా గ్రాస్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాకు యునానిమస్ రెస్పాన్స్ కనుక వచ్చి ఉంటే సినిమా హాల్ఫ్ మిలియన్ మార్క్ ని అవలీలగా అందుకుని ఉండేది, కానీ ఉన్నంతలో వచ్చిన టాక్ తోనే సినిమా ఓవరాల్ గా సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. ఇండియాలో కొంచం స్లో అయిన సినిమా వరల్డ్ వైడ్ గా పర్వాలేదు అనిపించేలా దూసుకు పోతుంది. ఇక లాంగ్ రన్ లో నాలుగు వేల కోట్ల మార్క్ ని అందుకునే దిశగా దూసుకుపోతుంది. ఇక ఈ ఇయర్ రిలీజ్ అయిన సినిమాల్లో డూన్ పార్ట్ 2, అలాగేబాబ్ మార్లే, ఘోస్ట్ బస్టర్స్, సినిమాలతో పాటు కుంగ్ ఫూ పాండ4 భారీ కలెక్షన్లను సాధించాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు