Priyamani First Salary : ప్రియమణి ఫస్ట్ సాలరీ ఎంతో తెలుసా? కోరికలన్నీ బయట పెట్టేసిన హీరోయిన్

Priyamani First Salary : సీనియర్ హీరోయిన్ ప్రియమణికి గోల్డెన్ టైమ్ నడుస్తుంది ఇప్పుడు. పెళ్లి ముందు కంటే తరువాతే ఈ బ్యూటీని మంచి మంచి ఆఫర్లు వెతుక్కుంటూ వస్తున్నాయి. మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ సినీ ప్రియులను అలరిస్తున్న ప్రియమణి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన ఫస్ట్ సాలరీతో పాటు ఇన్నాళ్లు మనసులో దాచుకున్న కొన్ని ఇంట్రెస్టింగ్ కోరికలను బయట పెట్టింది. మరి ఇప్పటి దాకా తీరని ప్రియమణి కోరికలు ఏంటి? అనే వివరాల్లోకి వెళ్తే…

సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస అవకాశాలు

ప్రియమణి తన అదిరిపోయే యాక్టింగ్ స్కిల్స్ తో ఇటు సౌత్ నుంచి అటు నార్త్ వరకు అన్ని వర్గాల ప్రేక్షకులకు దగ్గరయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ రెమ్యూనరేషన్ కోట్లలో అందుకుంటుందని సమాచారం. 2003లో ఎవరే అతగాడు మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రియమణి ఫస్ట్ మూవీతోనే విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత వరుసగా తెలుగు, తమిళ, మలయాళ పరిశ్రమలలో వరుస అవకాశాలు అందుకుంది. కానీ యమదొంగతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నప్పటికీ, తరువాత ఆఫర్లు తగ్గడంతో పెళ్లి బంధంలోకి అడుగు పెట్టింది. పెళ్లయిన తర్వాతే ఈ బ్యూటీకి లక్ కలిసి రావడం మొదలైంది.

ప్రియమణి ఫస్ట్ శాలరీ ఇదే

ముఖ్యంగా ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ ఆమె కెరీర్ ను ఊహించని మలుపు తిప్పింది. అందులో ప్రియమణి పాత్ర అందరిని ఆకట్టుకుంది. ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రియమణి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన ఫస్ట్ సాలరీ ఎంత అనే విషయాన్ని వెల్లడించింది. తాజాగా రిలీజ్ అయిన మైదాన్ అనే స్పోర్ట్స్ డ్రామాలో ప్రియమణి హీరోయిన్ గా నటించింది. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ హీరో పాత్రను పోషించారు. ఏప్రిల్ 10న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ కోసం ప్రియమణి 2 కోట్లకు పైగానే పారితోషకం తీసుకున్నట్టు సమాచారం. ఇక ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా తాజా ఇంటర్వ్యూలో తన మొట్టమొదటి సంపాదన గురించి మాట్లాడింది ప్రియమణి.

- Advertisement -

తన మొదటి సంపాదన కేవలం 500 రూపాయలని, అయినప్పటికీ తనకు అదెంతో విలువైనదని చెప్పుకొచ్చింది. ఇక ఈ సందర్భంగానే ఇప్పటి వరకు తీరని తన కోరికల చిట్టాలను విప్పింది ఈ బ్యూటీ. సింగర్ గా మారి ఏదైనా ఒక సినిమాలో పాడాలని, అలాగే మేకప్ లేకుండానే ఓ మూవీలో నటించాలనేవి తన కోరికలని చెప్పుకొచ్చింది. మరి ప్రస్తుతం మంచి జోష్ లో ఉన్న ప్రియమణి కోరికలను విని, ఏ మేకర్స్ అయినా ఆఫర్ ఇస్తారేమో చూడాలి. ఈ ఏడాది ప్రియమణి నటించిన భామాకలాపం 2, ఆర్టికల్ 370, మైదాన్ వంటి సినిమాలు బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయ్యాయి. ఈ సినిమాలన్నింటిలో ముఖ్యంగా ప్రియమణి పాత్రలకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. మొత్తానికి సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా సౌత్, నార్త్ భాషల్లో వరుస అవకాశాలు అందుకుంటూ అదరగొడుతోంది ప్రియమణి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు