Varun Sandesh : కోలీవుడ్ హీరోయిన్ పై మనసు పారేసుకున్న వరుణ్… ఆమెతో నటించాలని ఉందంటూ…

Varun Sandesh : హ్యాపీ డేస్ మూవీతో ఎంట్రీ ఇచ్చి యూత్ ఐకాన్ గా మారిన వరుణ్ సందేశ్ తాజాగా ఓ తమిళ హీరోయిన్ పై మనసు పారేసుకున్నాడు. తాజాగా జరిగిన ఈవెంట్లో తన మనసులోని మాటను బయట పెట్టాడు ఈ యంగ్ హీరో. మరి ఇంతకీ ఈ హీరో అంతగా ఆశపడుతున్న ఆ హీరోయిన్ ఎవరు? అనే వివరాల్లోకి వెళ్తే…

లక్కీ హీరోయిన్ పై వరుణ్ ఇంట్రెస్ట్

వరుణ్ సందేశ్ ఫస్ట్ మూవీ హ్యాపీ డేస్ తోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత కొత్త బంగారులోకం, కుర్రాడు, ఏమైంది ఈవేళ, మరో చరిత్ర వంటి వరుస రొమాంటిక్ సినిమాలు చేశాడు. అవకాశాలు పూర్తిగా తగ్గడంతో ఒకానొక సమయంలో బిగ్ బాస్ లో కూడా మెరిశాడు. రీసెంట్ గా ఇందువదన అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ చాలా కాలం నుంచి హిట్ కు దూరమైన వరుణ్ సందేశ్ ను ఈ మూవీ కూడా నిరాశ పరిచింది. ఇక చివరిగా వరుణ్ సందేశ్ మైఖేల్ అనే మూవీలో నటించాడు. సందీప్ కిషన్ హీరోగా నటించిన ఈ మూవీ పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. తాజాగా శబరి అనే మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో పాల్గొన్న వరుణ్ సందేశ్ తనకు ఓ కోలీవుడ్ హీరోయిన్ తో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఆశగా ఉందంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

వరుణ్ కొత్త మూవీ అనౌన్స్మెంట్

లక్కీ హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన శబరి అనే మూవీ రిలీజ్ కు రెడీ అవుతుంది. మహర్షి కూండ్ల సమర్పణలో మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించిన ఈ మూవీకి అనిల్ కాట్జ్ దర్శకత్వం వహించారు. మే 3న తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ భాషల్లో ఈ సస్పెన్స్ థ్రిల్లర్ రిలీజ్ కాబోతోంది. ఇక తాజాగా జరిగిన శబరి మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు గెస్ట్ గా హాజరైన వరుణ్ సందేశ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తను ఈ మూవీ నిర్మాత మహేంద్ర నాథ్ తో చాలా సినిమాలు చేశానని, అలాగే తన కెరీర్లో ఎంతో మంది దర్శక నిర్మాతలతో ట్రావెల్ అయ్యానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తను ఆయనతో ఓ సినిమా చేస్తున్నాను అనే విషయాన్ని ఈవెంట్ వేదికగా అనౌన్స్ చేశారు.

- Advertisement -

లక్కీ హీరోయిన్ ఉంటే లక్ కలిసి వస్తుందా?

ఇక ఈ ఏడాది రిలీజ్ అయినా మైఖేల్ మూవీలో తాను వరలక్ష్మి కలిసి నటించామని, కానీ తమ ఇద్దరి కాంబినేషన్లో సీన్స్ లేవని గుర్తు చేశారు. ఇక వరలక్ష్మి శరత్ కుమార్ తో కలిసి నటించాలని ఉందంటూ తన మనసులోని మాటను బయట పెట్టారు వరుణ్ సందేశ్. కానీ వరలక్ష్మి శరత్ కుమార్ వరుస ఆఫర్లతో లక్కీ హీరోయిన్ గా దూసుకెళ్తోంది. మరోవైపు ఆఫర్లు రాక కొట్టుమిట్టాడుతున్నాడు వరుణ్ సందేశ్. ఈ లక్కీ హీరోయిన్ తన సినిమాలో ఉంటే వరుణ్ కు లక్ కలిసి వస్తుందా? అనేది చూడాలి. శబరి నిర్మాతతోనే వరుణ్ నెక్స్ట్ మూవీ చేస్తున్నాడు కాబట్టి అందులో వరలక్ష్మి కూడా కీలకపాత్రను పోషించే అవకాశం లేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు