Prathnidhi2 : పదేళ్లకు మళ్ళీ అదే రోజు!

Prathnidhi2 : టాలీవుడ్ టాలెంటెడ్ హీరోల్లో ఒకరైన నారా రోహిత్ సినిమాల సెలక్షన్స్ గురించి తెలిసిందే. హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ హీరో, రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ కంటే కంటెంట్ బేస్డ్ స్టోరీస్ ను చేయడానికే ఎక్కువగా ఇష్టపడతాడు. తన మొదటి చిత్రం బాణం నుంచి ప్రస్తుతం రిలీజ్ కి సిద్ధం అవుతోన్న ప్రతినిధి 2 వరకు చాలా సినిమాల్లో సామాజిక కోణాన్ని టచ్ చేస్తూ సోషల్ ఎలిమెంట్స్ తో మూవీస్ చేస్తూ వస్తున్నాడు. అందుకే అతని కెరియర్ లో సక్సెస్ రేట్ తక్కువగా ఉన్నా కూడా, తన సినిమాలని ఆదరించే ప్రేక్షకులు కూడా ఉన్నారు. ఇదిలా ఉండగా నారా రోహిత్ కెరియర్ లో వచ్చిన ప్రతినిధి మూవీ 2014లో రిలీజ్ అయ్యి హిట్ అయింది. అందులో చిల్లర డబ్బుల్లో కూడా దోపిడీ ఎలా జరుగుతుంది అనేది చూపించి ఎవ్వరికి తెలియని కొత్త పాయింట్ ని హైలైట్ చేశారు మేకర్స్. నారా రోహిత్ కెరియర్ లో బెస్ట్ మూవీస్ లో ప్రతినిధి ఒకటిగా నిలిచింది. కట్ చేస్తే ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా ప్రతినిధి2 కూడా వస్తుందని తెలిసిందే.

ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయిన పదేళ్లకు అదే రోజు..

ఇక ప్రతినిధి రిలీజ్ అయిన పదేళ్ల తర్వాత ప్రతినిధి 2 టైటిల్ తో నారా రోహిత్ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు. అయితే కేవలం టైటిల్ మాత్రమే తీసుకుని పూర్తిగా కొత్త కథతో ఈ మూవీని తీయడం జరిగింది. ఇక ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, న్యూస్ యాంకర్ మూర్తి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేసిన ఈ సినిమా టీజర్ ఇప్పటికే ప్రేక్షకుల ముందుకొచ్చి ఆకట్టుకుంది. ప్రస్తుతం రాజకీయాలలో, పాలనలో అవినీతిని ప్రశ్నించే ఒక జర్నలిస్ట్ పాత్రలో నారా రోహిత్ ఈ చిత్రంలో నటిస్తున్నాడు. ఇదిలా ఉండగా, టీజర్ వచ్చినప్పుడు ఏప్రిల్ లో రిలీజ్ చేస్తామని ప్రకటించిన మేకర్స్ డేట్ మాత్రం ప్రకటించలేదు. ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయగా ఏప్రిల్ 25న ప్రతినిధి 2 మూవీని గ్రాండ్ గా రిలీజ్ కాబోతుందని ప్రకటించారు.

ఎలక్షన్స్ కి మూడు వారాల ముందు?

ఇక ఈ మధ్య గత రెండు నెలలుగా పలు పొలిటికల్ డ్రామాలు రిలీజ్ అయ్యాయన్న సంగతి తెలిసిందే. అయితే అవన్నీ బయోపిక్ సెటైరికల్ డ్రామాలుగా తెరకెక్కగా, ఒక వర్గానికి మాత్రమే చెందిన సినిమాలుగా తెరకెక్కి ప్రేక్షకులని ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయి. కానీ ఇప్పుడు వస్తున్న ప్రతినిధి 2 పక్కా సోషల్ ఎలిమెంట్స్ తో అన్ని వర్గాల కథాంశం తో వస్తున్న సినిమాగా తెరకెక్కింది. ఇక ఈ సినిమా ఎన్నికలకు దాదాపు మూడు వారాల ముందు రిలీజ్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఇక ప్రతినిధి 2 చిత్రాన్ని రియల్ లైఫ్ సంఘటనల స్ఫూర్తితో చేసినప్పటికి ఫిక్షనల్ స్టోరీగానే ఉండబోతోందని టాక్ వినిపిస్తోంది. మరి ఏపీ, తెలంగాణ రాజకీయాలలో ప్రతినిధి 2 ఎలాంటి ప్రభావం చూపిస్తుందనేది చూడాలి. మరి కొన్ని వార్తల ప్రకారం ప్రతినిథి2 సినిమాని కూడా రిలీజ్ కాకుండా కొందరు అడ్డుకోవాలని చూస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు