Siddharth : ఆడియన్స్ ని తప్పు పట్టిన సిద్ధూ..

Siddharth : సౌత్ ఇండియా లో టాలెంటెడ్ హీరోల్లో ఒకరైన సిద్ధార్థ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. దాదాపు రెండు దశాబ్దాలుగా తెలుగు, తమిళ భాషల ప్రేక్షకులని అలరిస్తున్న సిద్ధార్థ్ లాస్ట్ ఇయర్ చిన్నా సినిమాతో ఆడియన్స్ ని పలకరించాడు. అయితే అప్పట్లో తమిళ్ లోనే ఈ హీరో పరిచయమైనప్పటికీ అసలైన గుర్తింపు మాత్రం తెలుగు చిత్రాలతోనే దక్కించుకున్నాడు. తెలుగులో నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు, ఆట, కొంచెం ఇష్టం కొంచెం కష్టం వంటి సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్న సిద్ధార్థ్ ఆ తర్వాత తెలుగులో పెద్దగా సక్సెస్ లు అందుకోలేదు. ఆ తర్వాత కోలీవుడ్ కి వెళ్ళిపోయాడు. అయితే అక్కడ కూడా వరుసగా సినిమాలు చేసిన సిద్ధార్థ్ ఒక్క సరైన హిట్టు కూడా కొట్టలేకపోయాడు. అయితే ఆ మధ్య తెలుగులో శర్వానంద్ తో కలిసి మహా సముద్రం సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు సిద్ధార్థ్. కానీ ఈ సినిమా ప్లాప్ కావడంతో ఎటూ కాకుండా పోయాడు. మళ్ళీ తెలుగు సినిమాలు చేయలేదు.

చిన్నా తో సక్సెస్..

అయితే వరుస ప్లాపుల్లో ఉన్న సిద్ధార్థ్ కి లాస్ట్ ఇయర్ వచ్చిన చిన్నా కాస్త ఊరటనిచ్చిందని చెప్పాలి. అయితే హీరోగా సినిమాలు చేస్తూనే అభిరుచికి తగినట్టుగా తన ప్రొడక్షన్ లో సినిమాలు కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాడు సిద్ధార్థ్. అలా లాస్ట్ ఇయర్ సిద్ధార్థ్ నటించిన ‘చిత్తా’ సినిమా తెలుగులో చిన్నాగా రిలీజైంది. ఇక చాలా రోజుల తర్వాత సిద్ధార్థ్ కి ఒక డీసెంట్ సక్సెస్ ని అందించింది ఈ సినిమా. ఇక కోలీవుడ్ లో ఒకే అనిపించుకున్న ఈ సినిమా తెలుగులో మాత్రం అంతగా ఆడలేదు. ఆ మధ్య బెంగుళూరు లో ఈ సినిమా ప్రమోషన్ కి వెళ్లి అనుకోకుండా విమర్శల పాలయ్యాడు సిద్ధార్థ్. ఏది ఏమైనా చిన్నా సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ ని అనుకోకపోవడంతో, ఈ సినిమా ప్రమోషన్స్ లో తన లైఫ్ లో మళ్లీ ఇలాంటి సినిమా తీద్దామనుకున్నా కుదరదు అంటూ చెప్పుకొచ్చాడు సిద్ధార్థ్.

మృగం అని చెప్తే చూసేవారేమో?

తాజాగా కోలీవుడ్ లో జరిగిన ఒక అవార్డు ఫంక్షన్ లో సిద్ధార్థ్(Siddharth) మళ్లీ తన చిన్నా సినిమా గురించి ప్రస్తావించాడు. అక్కడ తన చిన్నా సినిమా గురించి మాట్లాడుతూ, తన సినిమా పేరు ‘చిత్తా’ అని కాకుండా ఈ సినిమాకు ‘మృగం’ అనే టైటిల్ పెట్టి ఉంటే ఆడియన్స్ చూసే వాళ్లేమో. కొందరు మగాళ్లు అలాంటి సినిమాలనే చూడాలని కోరుతున్నారు. చిన్నా లాంటి సినిమాలను వారు కోరుకోవట్లేదని అన్నాడు. అయితే సిద్ధార్థ్ ఈ సెటైర్ ఇన్ డైరెక్ట్ గా సందీప్ వంగ డైరెక్ట్ చేసిన యానిమల్ సినిమా గురించి చెప్పినట్టే అనిపిస్తుంది. వాళ్ళ అభిప్రాయాన్ని జడ్జ్ చేసే అవసరం కానీ కెపాసిటీ కానీ ఎవరికీ లేదు. కానీ సిద్ధార్థ్ మాత్రం తాను తీసిన సినిమా చూడలేదు కానీ, కొందరు మగాళ్లకు యానిమల్ లాంటి సినిమాలు ఇష్టం అంటూ ఆడియన్స్ మీద ఒక ఇండైరెక్ట్ గా సెటైర్ వేసాడు. తన సినిమాను చూడమని చెప్పడం వరకు ఓకే కానీ, వేరే సినిమాతో పోల్చి అలాంటి సినిమాలు మాత్రమే ప్రేక్షకులు చూస్తారని అనడం పై నెటిజన్లు సిద్ధార్థ్ కామెంట్స్ ని తప్పుపడుతున్నారు. అయితే ప్రేక్షకులు ఎలాంటి సినిమా చూడాలి అనేది వారి వ్యక్తిగత అభిప్రాయం. చిన్నా చూడలేకపోయినంత మాత్రాన, మంచి చిత్రాలు ప్రేక్షకులు ఆదరించరు అని అంటే అది పొరపాటే. యానిమల్ లాంటి సినిమాలు చూసిన ఆడియన్స్ హనుమాన్ ను కూడా ఆదరించారు. తీసే సినిమాను బట్టి సినిమా ఫలితం ఉంటుంది కానీ, ప్రేక్షకులని తప్పు పడితే పరిణామాలు తర్వాతి సినిమాల మీద ఉంటాయని ట్రేడ్ విమర్శకులు హెచ్చరిస్తున్నారు.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు