Game Changer Release date: డాక్టరేట్ వేదికపై గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన రామ్ చరణ్..

Game Changer Release date.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా పేరు దక్కించుకున్నారు. ఇక ఈ సినిమా తర్వాత ఆయన ఏకంగా మూడు సినిమాలను లైన్లో పెట్టిన విషయం తెలిసిందే. అందులో ఒకటి శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు రామ్ చరణ్.. మరొకవైపు ఈ సినిమా తర్వాత బుచ్చి బాబు సనా తో ఒక సినిమా, డైరెక్టర్ సుకుమార్ తో మరో సినిమా చేయబోతున్నారు. ఇప్పటికే బుచ్చిబాబు దర్శకత్వంలో చేసే సినిమాకి పూజా కార్యక్రమాలు పూర్తయి.. మొదటి షూటింగ్ షెడ్యూల్ కూడా ప్రారంభమైనట్లు సమాచారం.

Game Changer Release date:Ram Charan announced the release date of the game changer on the doctorate stage.
Game Changer Release date:Ram Charan announced the release date of the game changer on the doctorate stage.

ఇదిలా ఉండగా ఆర్ఆర్ఆర్ సినిమాతో వచ్చిన గుర్తింపు కారణంగా ఇప్పటికే రామ్ చరణ్ అనేక గౌరవాలను అందుకున్నారు.. ఇప్పుడు డాక్టరేట్ కూడా అందుకోవడం గమనార్హం… తమిళనాడు చెన్నై కి చెందిన వేల్స్ యూనివర్సిటీ లో ఈరోజు జరిగిన స్నాతకోత్సవ కార్యక్రమంలో రామ్ చరణ్ కి డాక్టరేట్ అందించారు. ఈరోజు సాయంత్రం 4:00 గంటలకు చెన్నై పల్లవరంలోని వేల్స్ క్యాంపస్ లో ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ చైర్మన్ ప్రొఫెసర్ పీజీ సీతారాం ముఖ్యఅతిథిగా పాల్గొని.. రామ్ చరణ్ కు డాక్టరేట్ అందించారు..

గేమ్ ఛేంజర్ రిలీజ్ పై క్లారిటీ..
గౌరవ డాక్టరేట్ అందుకున్న రామ్ చరణ్ అనంతరం వేదికపై మాట్లాడుతూ.. ప్రస్తుతం తాను నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చారు.. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో సినిమాను విడుదల చేస్తాము.. మొత్తం ఐదు భాషలలో రిలీజ్ అవుతుంది అంటూ క్లారిటీ ఇచ్చారు. మొత్తానికైతే ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత అదే పాన్ ఇండియా రేంజ్ లో రామ్ చరణ్ ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక అభిమానులు ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందో అని ఎదురు చూస్తుండగా.. రామ్ చరణ్ ఈ ఒక్క మాటతో ఫుల్ క్లారిటీ ఇచ్చేసారని చెప్పవచ్చు. ప్రస్తుతం ఎందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ గా మారుతోంది.

- Advertisement -

రామ్ చరణ్ కెరియర్..
తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి పాపులారిటీని ఉపయోగించుకొని చిరుత అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో మగధీర చేసి ఓవర్ నైట్ లోనే స్టార్ హీరో అయిపోయి.. ఆ తరువాత చేసిన ఆరెంజ్ సినిమా మాత్రం పెద్దగా గుర్తింపును అందివ్వలేదు. ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది కానీ ఈ సినిమాలోని పాటలు మాత్రం ఇప్పటికీ ఎవర్గ్రీన్ అని చెప్పాలి.. ఇక ఆ తర్వాత కథల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేసిన రామ్ చరణ్ పర్ఫెక్ట్ కథలను ఎంచుకుంటూ భారీ సక్సెస్ ని సొంతం చేసుకోవడమే కాదు నేడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నుంచి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గా తన పేరును పాపులారిటీని పెంపొందించుకున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు సినీ పరిశ్రమకు చేసిన సేవకుగాను గౌరవ డాక్టరేట్ అందుకోవడం నిజంగా ప్రశంసనీయమని చెప్పవచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు