Teja Sajja : సీక్రెట్ హిస్టరీ క్రియేట్ చేయనున్న తేజ..

Teja Sajja : టాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తూ పాపులర్ అయి, ఇప్పుడు హీరోగానూ మంచి సక్సెస్ అయిన టాలెంటెడ్ హీరో తేజ సజ్జ. జాంబి రెడ్డి, అద్భుతం వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న తేజ రీసెంట్ గా హనుమాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక తాజాగా తేజ సజ్జా వరుస క్రేజీ ప్రాజెక్టులను లైన్లో పెడుతున్నాడు. పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ అందుకున్న తర్వాత తేజ సజ్జకు ప్రముఖ స్టార్ ప్రొడక్షన్స్ సంస్థల నుంచి మంచి ఛాన్స్ లు వస్తున్నాయి. ఇక తేజ సజ్జా కూడా కథల విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇప్పటివరకు హనుమాన్ తర్వాత మరో సినిమా ప్రకటించలేదు. రొటీన్ కమర్షియల్ సినిమాలు ఏ మాత్రం టచ్ చేయకుండా వీలైనంత ఎక్కువగా ఎవరికీ తెలియని పాయింట్స్ తో మంచి కాన్సెప్ట్ తో సినిమాలు సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తుంది. పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ రావడంతో నిర్మాతలు కూడా తేజ కోసం పాన్ ఇండియా రేంజ్ లో అలాంటి కథలే సెట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తాజాగా తేజ సజ్జా తర్వాతి సినిమా గురించి క్రేజీ అప్డేట్ వచ్చింది.

పాన్ ఇండియా రేంజ్ లో తేజ సినిమా..

తాజాగా తేజ సజ్జ (Teja Sajja) హీరోగా కొత్త సినిమా అనౌన్స్ మెంట్ జరిగింది. ఈ హీరో నుంచి రాబోయే సినిమాలలో తాజాగా ఓ సినిమా నిర్మిస్తున్నట్టు ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు ప్రకరించారు. అయితే ఈ నిర్మాణ సంస్థలో తేజ సజ్జా సినిమా ఉండబోతుందని ఇంతకు ముందే పలు రకాల వార్తలు వైరల్ అయ్యాయి. అయితే తాజాగా ఈ విషయాన్ని కంఫర్మ్ చేస్తూ అఫీషియల్ గా ఒక ప్రత్యేకమైన పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఈ మూవీ పై మరిన్ని అప్డేట్స్ రెండు రోజుల్లో ప్రకటిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ సినిమాను ఈగల్ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేయబోతున్నాడని సమాచారం. ఇక ఈ సినిమా చారిత్రక అంశం తోనే తెరకెక్కబోతున్నట్టు తెలుస్తోంది. చరిత్రను తిరగరాసే రహస్యం అంటూ ఒక అద్భుతమైన క్యాప్షన్ తో ఆసక్తికరమైన పోస్టర్లను మేకర్స్ విడుదల చేశారు. అందులో ప్రతి చరిత్రకు ఒక సీక్రెట్ ఉంటుందని, కానీ ఈ సీక్రెట్ లో ఒక చరిత్ర ఉంది అంటూ పోస్టర్లో వివరణ ఇచ్చారు.

భారీ క్యాస్టింగ్ తో సినిమా..

ఇక తేజ సజ్జ హీరోగా నటించబోయే ఈ సినిమాకు ‘సూపర్ యోధ’ అనే టైటిల్ సెట్ చేసినట్లు సమాచారం. అయితే దీనిపై పూర్తి వివరాలను ఈనెల 15వ తేదీన మరొక అప్డేట్ ద్వారా తెలియజేయనున్నారు. మరొక ఇంట్రస్టింగ్ న్యూస్ ఏంటంటే మంచు మనోజ్ ఇందులో ప్రతినాయకుడిగా కనిపించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మంచు మనోజ్ నెగిటివ్ షేడ్స్ లో కనిపిస్తే మాత్రం తప్పకుండా సినిమాకు హై లెవెల్లో క్రేజ్ వస్తుంది. అంతేకాకుండా మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కూడా ఒక ప్రత్యక కీలక పాత్రలో, దాదాపు అరగంట కనిపిస్తాడని వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సినిమాపై పూర్తి వివరాలు తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు