Teja Sajja : కుర్ర హీరోపై 40 కోట్ల బడ్జెట్టా? రిస్క్ చేస్తున్నారా!

Teja Sajja : టాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్టుల నుండి హీరోలుగా పరిచయమైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే వాళ్లలో సక్సెస్ అయినవాళ్లు మాత్రం చాలా తక్కువ మంది. ఇప్పుడున్న టాప్ హీరోల్లో మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా సినిమాలు చేసి హీరోలుగా లాంచ్ అయినవాళ్లే. ఇక ఆ తర్వాత మంచు మనోజ్, తరుణ్ కూడా బాల నటుల నుండి హీరోలుగా పరిచయమయ్యారు. వీళ్ళు తప్ప సుదీర్ఘ కెరీర్ ని నిలదొక్కుకున్న వాళ్లు తక్కువమందే. ఇప్పుడు తరుణ్ సైతం ఒక దశ దాటాక సరైన సినిమాలు పడక ఫేడవుట్ అయిపోయాడు. మంచు మనోజ్ దీ అదే పరిస్థితి గా ఉంది. అయితే అనూహ్యంగా చైల్డ్ ఆర్టిస్ట్ నుండి మళ్ళీ హీరోగా బలమైన ముద్ర వేసిన బాల నటుడు ఈ మధ్య కాలంలో తేజ సజ్జనే అని చెప్పాలి. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఇలా ఒకప్పటి టాప్ స్టార్లు చాలామందితో స్క్రీన్ షేర్ చేసుకున్న తేజ సజ్జ ముందుగా ‘ఓ బేబీ’ లాంటి లేడీ ఓరియెంటెడ్ మూవీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కీలక పాత్ర చేశాడు. తర్వాత ‘జాంబి రెడ్డి’ సినిమాతో హీరోగా మారి ఓ మోస్తరు విజయాన్నందుకున్నాడు.

హనుమాన్ తో సూపర్ క్రేజ్!

జాంబి రెడ్డి తో హిట్ అందుకున్న తేజ ఆ తర్వాత అద్భుతం తో మరో యావరేజ్ సక్సెస్ అందుకోగా, అతడి దశ తిరిగేలా చేసింది మాత్రం ‘హనుమాన్’ మూవీనే. ఈ సినిమా ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి తేజ కెరీర్‌నే మార్చేసింది. నిజానికి ఈ సినిమా అంత పెద్ద సక్సెస్ అవుతుందని ఎవరూ ఊహించలేదు కూడా. ఇక ఇప్పుడు తేజ సజ్జ తర్వాతి సినిమా కోసం అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. తేజ కూడా వరుస ప్రాజెక్టులను లైన్లో పెట్టాడు. అయితే తేజ ‘హనుమాన్’ సినిమా రిలీజ్ కంటే ముందు ఒప్పుకున్న సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఆ సినిమా పేరు ‘మిరాయ్’. ‘ఈగల్’ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని రూపొందిస్తున్న చిత్రమిది. ఇక ‘మిరాయ్’ అనేది జపనీస్ వర్డ్ అని సమాచారం. ఇక తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ఇదొక యాక్షన్ అడ్వెంచర్ మూవీ అని, ఇందులో మంచు మనోజ్ నెగెటివ్ షేడ్స్ ఉన్న ప్రత్యేక పాత్ర పోషిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇక పీపుల్స్ మీడియా సంస్థ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తోందని సమాచారం.

తేజ సజ్జ పై 40 కోట్లు.?

అయితే తేజ సజ్జ(Teja Sajja) తో చేయబోయే ఈ సినిమా 40 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందనుందట. నిజానికి ఇంతకు ముందు ఓ మోస్తరు బడ్జెట్లో తీయాలనుకున్న మూవీ ఇది. కానీ ‘హనుమాన్’ సినిమా తో తేజ సజ్జా మార్కెట్ పెరిగిపోవడం, పాన్ ఇండియా స్థాయిలో అతడికి ఫాలోయింగ్ ఉండడంతో మంచి క్వాలిటీతో పెద్ద స్థాయిలోనే సినిమా తీయాలని నిర్మాతలు ప్రణాళికలు మార్చారట. దీంతో బడ్జెట్ రూ.40 కోట్లకు పెరిగినట్లు సమాచారం. ఇందులో తేజ సరసన రితిక నాయక్ హీరోయిన్ గా నటిస్తోందని సమాచారం. త్వరలోనే సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ చేసి జూన్ లో మూవీ ని రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారట. అయితే ట్రేడ్ విశ్లేషకులు మాత్రం ఇంత మార్కెట్ పెరిగినంత మాత్రాన ఇంత బడ్జెట్ అవసరమా అని అంటున్నారు. హనుమాన్ హిట్ అయినప్పటికీ అన్ని సినిమాలు అదే స్థాయిలో రెస్పాన్స్ తెచ్చుకోవు. పైగా కార్తీక్ ఘట్టమనేని ఆల్రెడీ ఈగల్ తో ప్లాప్ అందుకున్నాడు. పైగా తేజ సజ్జతో ఇప్పటివరకు అంత భారీ బడ్జెట్ తో ఎవరూ సినిమా తీయలేదు. అయితే కంటెంట్ డిమాండ్ చేస్తే పెట్టక తప్పదు కూడా. కానీ అది ఓవర్ లిమిట్ దాటితే మొదటికే మోసం వస్తుందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు