Family Star : తన సినిమాతో పాటుగా చిన్న సినిమా ప్రోమోషన్

Family Star : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక హీరోగా నిలబడటం ఎంత కష్టమైన ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోగా నిలబడటం కంటే ముందు ఒక నటుడుగా ప్రూవ్ చేసుకోవాలి. నటుడుగా ప్రూవ్ చేసుకోవడానికి ఎన్నో ఆడిషన్స్ ఇవ్వాలి. ఆడిషన్స్ ఇచ్చిన ప్రతి చోట అవకాశం దొరుకుతుందని గ్యారెంటీ లేదు. కొన్నిసార్లు అవకాశం దొరికినా కూడా అది మంచి గుర్తింపును తీసుకురాదు. అలా తమకంటూ ఒక సొంత గుర్తింపును సాధించి ఇండస్ట్రీలో నిలబడి ఈ రోజు స్టార్ హీరోలుగా ఎదిగిన వాళ్ళు కూడా ఉన్నారు.

నువ్విలా, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ వంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలలో కనిపించాడు విజయ్ దేవరకొండ. ఆ తర్వాత ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో రిషి అనే పాత్రతో మంచి గుర్తింపును సాధించుకున్నాడు. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన పెళ్లిచూపులు అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు విజయ్. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయాన్ని సాధించింది. ఆ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగ దర్శకుడుగా పరిచయమైన అర్జున్ రెడ్డి సినిమా విజయ్ కి మంచి స్టార్ డం తీసుకొచ్చింది.

ఇకపోతే అర్జున్ రెడ్డి సినిమా తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి రాలేదు విజయ్ దేవరకొండ కి. విజయ్ చేసిన టాక్సీవాలా సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయం సాధించింది.ఆ తర్వాత చేసిన గీత గోవిందం సినిమా దాదాపు 100 కోట్లు వరకు వసూలు చేసి మరోసారి ఫ్యామిలీ ఆడియన్స్ కు విజయ్ దేవరకొండ ను దగ్గర చేసింది. అయితే ఆ సినిమా తర్వాత వచ్చిన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పర్వాలేదు అనిపించుకున్నాయి.

- Advertisement -

ఇకపోతే ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ అనే సినిమాను చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమా ఏప్రిల్ 5న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు విజయ్. ఈ సినిమాను పరశురాం తీసాడు. ఇదివరకే వీరి కాంబినేషన్ లో గీతగోవిందం సినిమా వచ్చి మంచి కలెక్షన్స్ ను వసూలు చేసింది. గీత గోవిందం తర్వాత ఈ కాంబినేషన్ లో సినిమా వస్తుండడం పై మంచి అంచనాలు ఉన్నాయి.

ఇదివరకే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ అండ్ ట్రైలర్ అద్భుతంగా ప్రేక్షకులును ఆకట్టుకున్నాయి. ఈ సినిమా పాటలు కూడా వినసొంపుగా ఉన్నాయి. ఈ సినిమా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉండబోతుంది అంటూ దిల్ రాజు కూడా చెప్పుకొచ్చారు. అయితే ఇదే సినిమాతో పాటుగా బహుముఖం అనే ఒక చిన్న సినిమా కూడా రిలీజ్ అవుతుంది. ఫ్యామిలీ స్టార్ ( Family Star ) సినిమా ప్రోమోషన్స్ లో ఉన్న విజయ్ దేవరకొండకు ఈ చిత్ర యూనిట్ కనిపించగానే ఈ చిత్రాన్ని కూడా ప్రోమోట్ చేశాడు విజయ్. ఇదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన సినిమాతో పాటుగా రిలీజ్ అవుతున్న వేరే సినిమాను కూడా ఆదరించండి అని విజయ్ చెప్పటం చాలామందికి ఆశ్చర్యం కలిగించింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు